Skills For the future: ఈ స్కిల్స్ ఉంటే తిరుగు లేదు.. భవిష్యత్ జాబ్ మార్కెట్‌లో వీరికే ఫుల్ డిమాండ్!

by Javid Pasha |
Skills For the future: ఈ స్కిల్స్ ఉంటే తిరుగు లేదు.. భవిష్యత్ జాబ్ మార్కెట్‌లో వీరికే ఫుల్ డిమాండ్!
X

దిశ, ఫీచర్స్ : టాలెంట్ ఎవరి సొత్తూ కాదు.. అది ఉండాలేగానీ ఏదైనా సాధించవచ్చు అంటుంటారు నిపుణులు. మీలోని నైపుణ్యాలకూ ఇది వర్తిస్తుంది. ఆధునిక సమాజంలో, ముఖ్యంగా ఈ పోటీ ప్రపంచంలో దూసుకుపోవాలంటే ప్రధానంగా ఉండాల్సింది స్కిల్స్ మాత్రమే. అయితే కాలానుగుణంగా అవి కూడా మారుతుంటాయి. పదేండ్ల క్రితం నేర్చుకున్న అంశాలు, అలవర్చుకున్న నైపుణ్యాలు రేపటి జాబ్ మార్కెట్‌కు పనికి రాకపోవచ్చు. కాబట్టి ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. మారుతున్న టెక్నాలజీని బట్టి, అప్పుడున్న పరిస్థితులను బట్టి భవిష్యత్తులో ఎలాంటి కెరీర్ వైపు యూత్ ఆసక్తి చూపుతుంది? ఎలాంటి స్కిల్స్ నేర్చుకుంటే మేలు జరుగుతుందనే విషయాలను నిపుణులు అంచనా వేస్తున్నారు.

మారుతున్న ట్రెండ్

ఐటీ నుంచి డిఫెన్స్ వరకు, హాస్పిటాలిటీ నుంచి ఏవియేషన్ వరకు.. ఇలా ఎక్కడ చూసినా ఇటీవలి కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) హవా కనిపిస్తోంది. రాబోయే రోజుల్లో ఈ ట్రెండ్ మరింత పెరుగుతుందని, జాబ్ మార్కెట్‌ను శాసించనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అదే సందర్భంలో ఏఐ ప్రవేశంతో ఉద్యోగాలు ఊడుతాయన్న సందేహాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. నష్టాలు జరగొచ్చని కొందరు భావిస్తున్నారు. కానీ అలాంటి అవకాశాలు చాలా అరుదుగానే ఉంటాయని సాంకేతిక నిపుణులు అంటున్నారు. ఏఐ‌తో పాటు ఇతర ఏ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వచ్చినా నష్టాలకంటే లాభాలే అధికంగా ఉంటాయని చెప్తున్నారు. ముఖ్యంగా ఏఐ బేస్డ్ స్కిల్స్ ఆధారంగానే భవిష్యత్తులో ఎంప్లాయిమెంట్ జనరేషన్ అధికంగా క్రియేట్ అయ్యే అవకాశం ఉందనే అంచనాలు ఉన్నాయి. అయితే ఫ్యూచర్ జాబ్ మార్కెట్‌లో డిమాండ్ ఎక్కువగా పెరిగే అవకాశం ఉన్న కోర్సులు నేర్చుకోవడం, నైపుణ్యం అలవర్చుకోవడం చాలా ముఖ్యమని కూడా నిపుణులు చెప్తున్నారు.

డేటా సైంటిస్ట్

ప్రస్తుతం వేగంగా అభివృద్ధి చెందుతున్న వాటిలో డేటా సైన్స్ ఒకటి. ఈ సెక్టార్‌లో వర్క్ చేసేవారినే డేటా సైంటిస్టులు, డేటా అనలిస్టులుగా పేర్కొంటారు. అయితే 2029 నాటికి మనదేశంలో డేటా సైన్స్ వృద్ధిరేటు 3.38 బిలియన్ డాలర్లకు పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. చిన్న స్టార్టప్ మొదలు కొని పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థల వరకు ఏఐ వంటి టూల్స్ ఇప్పటికే ఉపయోగిస్తున్నారు. భవిష్యత్తులో డేటా సైన్స్ అనలిస్టులకు వీటి అవసరం మరింత పెరుగుతుంది. అందుకే ఈ రంగంలో దూసుకుపోవాలంటే ఎంఎల్, ఏఐ స్కిల్స్ తప్పక అవసరం అవుతాయని, అలాంటి నైపుణ్యాలు అలవర్చుకున్న వారికే భవిష్యత్ జాబ్ మార్కెట్లో డిమాండ్ ఉంటుందని నిపుణులు చెప్తున్నారు.

ఏఐ రీసెర్చ్ సైంటిస్టులు

నిజానికి ఏఐ పరిశోధక శాస్త్రవేత్తలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో సరికొత్త మోడల్స్, టెక్నిక్స్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే ఉన్న టెక్నాలజీని ఉపయోగించుకుంటూ.. ఏఐ మోడల్స్‌ను మరింత అడ్వాన్స్‌డ్‌గా మార్చడంపై వీరు ఫోకస్ పెట్టాల్సి ఉంటుందని నిపుణులు అంటున్నారు. అందుకోసం అల్గారిథమ్‌లను అభివృద్ధి చేయడం, డెవలప్ అవుతున్న సాంకేతికతపై మరింత రీసెర్చ్ చేయడం, ప్రోటోటైప్‌లను డెవలప్ చేయడం వంటి యాక్టివిటీస్‌తో ఏఐ టెక్నాలజీని అవసరాలకు అనుగుణంగా మల్చుకోవాలి. ఇందుకోసం భవిష్యత్తులో ఏఐ రీసెర్చ్ సైంటిస్టులకు భారీగా డిమాండ్ పెరిగే అవకాశం ఉందంటున్నారు నిపుణులు.

ఏఐ స్పెషలిస్టులు

ఒక రంగం అభిృద్ధి చెందాలంటే అక్కడ మానవ వనరులు కీలకపాత్ర పోషిస్తాయి. అయితే అందుకు టెక్నాలజీ తోడైతే అద్భుతాలు క్రియేట్ చేయవచ్చు. ప్రస్తుతం ఏఐ ద్వారా అదే చేయాలని అనేక కార్పొరేట్ కంపెనీలు భావిస్తున్నాయి. అందుకే ఫ్యూచర్ జాబ్ మార్కెట్‌లో ఏఐ స్పెషలిస్టుల అవసరం పెరగనుంది. పలు నివేదికల ప్రకారం.. వచ్చే ఐదేండ్లలో మన దేశంలోని పలు సెక్టార్లలో 30 నుంచి 40 వేల శాతం ఏఐ స్పెషలిస్టుల అవసరం ఏర్పడవచ్చనే అంచనాలు ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా అయితే ఇంకా చాలానే ఉంటుంది. ముఖ్యంగా ఏఐ మోడల్స్ డిజైనింగ్ అండ్ టెస్టింగ్, టూల్స్‌ను, సిస్టమ్‌లను సక్రమంగా, సమర్థవంతంగా ఉపయోగించడం, ఇతరులకు ట్రైనింగ్ ఇవ్వడం వంటి నైపుణ్యాలు గల స్పెషలిస్టులకు భవిష్యత్ జాబ్ మార్కెట్లో ఫుడ్ డిమాండ్ ఉండవచ్చు.

మెషిన్ లెర్నింగ్ ఇంజినీర్

భవిష్యత్ జాబ్ మార్కెట్లో డిమాండ్ ఉండే అవకాశం ఉన్న వాటిలో మెషిన్ లెర్నింగ్ ఇంజినీర్ ఒకటి. ఏఐ‌లో ఇది కూడా ఒక భాగం. ముఖ్యంగా మెషిన్ లెర్నింగ్ అల్గారిథమ్స్ క్రియేషన్ అండ్ మేనేజ్‌మెంట్‌పై కార్పొరేట్ సంస్థలు దృష్టి సారిస్తాయి. కాబట్టి ఈ రంగంలో మెషిన్ లెర్నింగ్ ఇంజినీర్ వంటి ఉద్యోగాలు సృష్టించబడతాయని నిపుణులు అంటున్నారు. అలాగే పెద్ద ఎత్తున డేటాను క్రోడీకరించి, ప్రాసెస్ చేసే సిస్టమ్‌ల రూపకల్పన, ఆప్టిమైజ్ చేయడం వంటివి తప్పక అవసరం అవుతాయి. కాబట్టి ఏఐ స్కిల్స్ అలవర్చుకున్న వారికి డిమాండ్ పెరగనుంది. అలాగే రాబోయే మూడేండ్లలో మెషిన్ లెర్నింగ్ ఇంజినీరింగ్ నిపుణుల డిమాండ్ దాదాపు 41 శాతం పెరగవచ్చనే అంచనాలు ఉన్నాయి.

బిజినెస్ ఇంటెలిజెన్స్ అనలిస్టులు

ఎవరు ఎన్ని చెప్పినా కాలం మారుతూనే ఉంది. అందుకు అనుగుణంగానే అవకాశాలు సృష్టించబడుతున్నాయి. సో.. నైపుణ్యాలు కూడా అలవర్చుకోక తప్పదని నిపుణులు చెప్తున్నారు. భవిష్యత్ జాబ్ మార్కెట్‌ను శాసించగల ఉద్యోగాల జాబితాలో బిజినెస్ ఇంటెలిజెన్స్ అనలిస్టులు తప్పక ఉంటారు. వీరు అందించే ఇన్ఫర్మేషన్‌పై ఆధారపడి ఆయా కార్పొరేట్ సంస్థలు, ఇతర రంగాలు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటాయి. ప్రణాళికలు రూపొందిస్తాయి. కాబట్టి ఏఐ టూల్స్ ఉపయోగించగలిగే అధిక నైపుణ్యం కలిగిన బిజినెస్ ఇంటెలిజెన్స్ అనలిస్టులకు రానున్న పదేండ్లలో భారీ డిమాండ్ పెరగనుందని నిపుణులు చెప్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed