- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దేవాలయం నీడ ఇంటి మీద పడకూడదా?
దిశ, వెబ్ డెస్క్: దేవాలయం పవిత్రమైన స్థలం. శాస్త్రబద్దంగా నిర్మించిన ఆలయం ఓ శక్తి కేంద్రం. నిత్యం అర్చనలు, అభిషేకాలు జరుగుతుంటాయి. ఊరిలోని వారంతా ఆలయానికి వస్తూ ఉంటారు. ఆ దేవుని సన్నిధిలో తన్మయత్వం పొందుతారు. కానీ అత్యంత శక్తివంతమైన ఈ ప్రదేశం పక్కన ఇల్లు ఉండటం గురించి పండితులు చెప్పే విషయాలు ఏమిటో ఇక్కడ చూద్దాం..
మనం హోమానికి అతి దగ్గరగా ఎందుకు కూర్చోమని సందేహం చాలా మందికి వస్తుంది? ఎందుకంటే.. ఆ వేడిని తట్టుకునే శక్తి మనకు ఉండదు కాబట్టి. అలాగే దేవాలయం అత్యంత సమీపంలో ఉండే ఇళ్లకు ఇదే వర్తిస్తుంది. దేవుడి ధ్వజము శక్తి సంపన్నం, ఉగ్రరూపం. ఆ ఉగ్రరూప శక్తిని తట్టుకోలేదని, ఇంటిపై ధ్వజస్తంభం నీడ కూడా పడకూడదంటారు. అమ్మ వారి ఆలయానికి దగ్గర్లో ఉంటే, ఆ శక్తి కారణంగా ఆ ఇంట్లోని వారు ఎవరూ వృద్ధి చెందరు, ఏ కార్యక్రమంలోనూ పురోగతి సాధించరని చెబుతారు. అదే ఇల్లు శివాలయానికి దగ్గరలో ఉంటే శత్రు భయం, విష్ణు ఆలయానికి దగ్గరలో ఉంటే ఇంట్లో డబ్బు నిలవదని పండితులు చెబుతారు. ఏ ఆలయానికి దగ్గరలో తీసుకున్నా కనీసం 200 అడుగుల దూరంలో ఉండేలా ఇల్లు తీసుకుంటే మంచిది. ఇంటికి, గుడికి ఉండే దూరాన్ని గర్భ గుడిలో మూల విరాట్టు విగ్రహం నుంచి పరిగణలోకి తీసుకోవాలి. వాస్తు శాస్త్రం ప్రకారం శివాలయాలకు వెనుక వైపు, విష్ణు ఆలయాలకు ముందు వైపు ఇల్లు ఉండోచ్చట.
గమనిక: పైన రాసిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. దీనిని 'దిశ' ధృవీకరించట్లేదు
ఇవి కూడా చదవండి: