హాయిగా పడుకున్న వ్యక్తిన సడెన్‌గా లేపితే ఏం జరుగుతుందో తెలుసా?

by Jakkula Samataha |
హాయిగా పడుకున్న వ్యక్తిన సడెన్‌గా లేపితే ఏం జరుగుతుందో తెలుసా?
X

దిశ, ఫీచర్స్ : నిద్ర ఆరోగ్యానికి చాలా మంచిది. కంటి నిండ నిద్ర ఉంటే ఆ వ్యక్తి చాలా ఆరోగ్యంగా ఉంటాడు. అందుకే ప్రతీ వ్యక్తి కనీసం ఏడు నుంచి ఎనిమిది గంటలు నిద్రపోవాలని వైద్యులు చెబుతున్నారు.అయితే నిద్రలో కొంత మందికి కలలు వస్తుంటాయి. మరి కొందరు ఉలిక్కిపడి లేవడం జరుగుతుంది. ఇదంతా పక్కన పెడితే గాఢనిద్రలో ఉన్నవారిని అస్సలే లేపకూడదు అని మన పెద్దలు, వైద్యులు చెబుతుంటారు. ఎందుకంటే మంచి నిద్రలో ఉన్నవారిని సడెన్‌గా లేపితే వారు చనిపోయే ప్రమాదం ఎక్కువగా ఉందంట.

మరి అసలు గాఢనిద్రలో ఉన్నవారు చనిపోయే అవకాశం ఎందుకు ఉంది? వారిని ఎందుకు లేపకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.

మనం హాయిగా నిద్రపోయినప్పుడు, గాఢ నిద్రలోకి జారుకుంటాం. ఇలాంటి సమయంలో మన మెదడు చాలా చురుకుగా ఉంటుందంట. అంతే కాకుండా నిద్రలో మెదడు శరీర కణాలను సరిచేయడం, కొత్త జ్ఞాపకాలను నిల్వ చేయడం లాంటి ముఖ్యమైన విధులను నిర్వహిస్తుంది. మనం అకస్మాత్తుగా నిద్రలేచినట్లయితే మెదడు పై ఒత్తిడి పడుతుంది. దీని కారణంగా రక్తప్రసరణ ఒక్కసారిగా ఆగిపోవడం జరుగుతుందంట. దీంతో ఆ వ్యక్తి ఆకస్మాత్తుగా చనిపోయే అవకాశం ఉంది అంటున్నారు వైద్యులు. అందువలన ఎప్పుడూ గాఢ నిద్రలో ఉన్నవారిని ఆకస్మాత్తుగా లేపకూడదు.

Advertisement

Next Story

Most Viewed