Blood Pressure: హైబీపీ కంట్రోల్ అవ్వాలంటే ఈ పండు తినాల్సిందే?

by Prasanna |   ( Updated:2023-07-28 06:11:28.0  )
Blood Pressure: హైబీపీ కంట్రోల్ అవ్వాలంటే  ఈ పండు తినాల్సిందే?
X

దిశ,వెబ్ డెస్క్: చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు అందరూ ఇష్టపడే పండ్లలో అరటిపండు ఒకటి. వీటిలో 1,000 రకాల అరటిపండ్లు ఉన్నాయి. పసుపు పచ్చ అరటి పండ్లు, చక్కెరకేళి, కొండ అరటి పండ్లు, అమృతపాణి, ముకిరీ, కర్పూరం, కర్పూర చక్కెర కేళీ ఇలా కొన్ని రకాల అరటిపండ్లు మాత్రమే మనకు తెలుసు. వాటిలో ఎర్రటి పండ్లు కూడా ఒకటి. అయితే ఇవి మనకు చాలా అరుదుగా దొరుకుతాయి. ఈ ఎర్రటి అరటిపండ్ల వల్ల మన ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు ఇక్కడ చూద్దాం..

వీటిలో పొటాషియం, విటమిన్ సి, విటమిన్ బి6 వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అంతే కాకుండ ఫైబర్ కూడా ఉంటుంది. ఈ పండులో పొటాషియం అధికంగా ఉంటుంది. హైబీపీతో బాధ పడే వారు ఈ పండును మీ ఆహారంలో చేర్చుకోండి. దీని వల్ల మీ బీపీ కంట్రోల్ అవుతుంది. అలాగే బరువు ఎక్కువగా ఉన్నారని బాధ పడే వారు ఈ పండ్లు మంచి ఆహారం. ఎందుకంటే వీటిలో తక్కువ కేలరీలు ఉంటాయి, ఇవి మీ బరువు తగ్గించడంలో కీలక పాత్ర వహిస్తాయి. కాబట్టి వీటిని ఎక్కువగా తీసుకుంటూ ఉండండి.

Read More: తల్లిదండ్రుల మరణంతో తీవ్రంగా సఫర్ అవుతున్న బాయ్స్.. అమ్మాయిలకంటే ఎక్కువే..

Advertisement

Next Story