మామిడి ప్రియులకి షాకింగ్ న్యూస్!.. మార్కేట్‌లో సందడి చేస్తున్న నకిలీ మ్యాంగోస్

by Kavitha |
మామిడి ప్రియులకి షాకింగ్ న్యూస్!.. మార్కేట్‌లో సందడి చేస్తున్న నకిలీ మ్యాంగోస్
X

దిశ, ఫీచర్స్: సాధారణంగా సంవత్సరానికి ఒకసారి లభించే మామిడి పండ్ల కోసం ఇయర్ మొత్తం వెయిట్ చేస్తూ ఉంటారు. ఇక మార్కెట్‌లో విపరీతంగా అమ్ముడవుతున్న మామిడి పండ్లను బండ్లపై చూడగానే మామిడి ప్రియులు ఎగబడిపోతారు. కానీ, అందులో అసలు ఏది, నకిలీ ఏది అనేది మాత్రం పట్టించుకోరు. అదేంటి మామిడి పండ్లలో నకిలీ అనేది కూడా ఉంటుందా అని డౌట్‌గా ఉంది కదూ.. అవునండి బాబు మీరు విన్నది నిజమే.. ప్రస్తుత కాలంలో మార్కెట్లో చాలా నకిలీ మామిడి పండ్లు వస్తున్నాయి. ఇలాంటివి తిన్నారా ఇక అంతే సంగతులు. దీనికి సంబంధించి తమిళనాడులో ఓ షాకింగ్‌ న్యూస్‌ వెలుగులోకి వచ్చింది. తమిళనాడులోని ఆహార భద్రతా విభాగం ఒక గిడ్డంగి నుంచి నకిలీ మామిడి పండ్లను స్వాధీనం చేసుకుంది. సుమారు ఏడున్నర టన్నుల నకిలీ మామిడిపండ్లను సీజ్‌ చేసిన అధికారులు వాటిని తింటే ఎంత ప్రమాదమో ప్రజలకు వెల్లడించారు.

నకిలీ మామిడి పండ్లు అనేగానే అవి యంత్రాల ద్వారా తయారవుతాయని అనుకోవద్దు. దాని అర్థం వేరే ఉంది.. ఈ మామిడి పండ్లను చెట్ల నుండి తీసి, కృత్రిమంగా త్వరగా పండించి మార్కెట్‌కు తరలిస్తారు. అందుకే వీటిని నకిలీ మామిడి అని పిలుస్తారు. ఈ నకిలీ మామిడి పండ్లను పండించడానికి కాల్షియం కార్బైడ్ ఉపయోగిస్తారు. అయితే దాని ఉపయోగం పూర్తిగా నిషేధించబడింది. ఎందుకంటే దాని సహాయంతో పండిన పండ్లు మానవ ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమైనవి. ఎవరైనా కాల్షియం కార్బైడ్‌తో మక్కబెట్టిన మామిడి పండ్లను తింటే అది వారి ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం అంటున్నారు నిపుణులు.

కాల్షియం కార్బైడ్ మార్కెట్‌లో సులువుగా దొరుకుతుంది. ఇది ఒక రకమైన రాయిలా ఉంటుంది. అందుకే ప్రజలు దీనిని సున్నపురాయి అని కూడా పిలుస్తారు. కాల్షియం కార్బైడ్‌తో మామిడి పండ్లను పండించడానికి, కార్బైడ్‌ను పచ్చి మామిడికాయల మధ్య ఒక కట్టలో ఉంచుతారు. మామిడికాయల బుట్టలో కాల్షియం కార్బైడ్ చుట్టూ మామిడికాయలను ఉంచి, ఆపై దానిని గోనె సంచులతో కప్పేస్తారు. ఈ మామిడి పండ్లను 3-4 రోజులు గాలి లేని ప్రదేశంలో ఉంచుతారు. దాని కారణంగా అవి పండిపోతాయి. కాల్షియం కార్బైడ్‌ను తేమతో సంబంధం లేకుండా ఎసిటిలీన్ వాయువు ఏర్పడుతుంది. ఏ రకమైన పండు అయినా దీంతో ఈజీగా పండుతుంది.

ఇలా కాల్షియం కార్బైడ్‌తో పండిన మామిడి పండ్లను తీసుకోవడం ప్రజలకు చాలా ప్రమాదకరం. దీన్ని తీసుకోవడం వల్ల కడుపు నొప్పి నుంచి విరేచనాలు, వాంతులు వంటి సమస్యలు వస్తాయి. ఇది మాత్రమే కాదు, తలనొప్పి, మానసిక ఆందోళన, తల తిరగడం, మూర్ఛతో కూడా బాధపడే అవకాశం ఉంది.

Advertisement

Next Story

Most Viewed