లైంగిక ఆరోగ్యం : ఆ ఒక్క విషయంలో పురుషులకంటే స్త్రీలే ఎక్కువ ఎంజాయ్ చేస్తారట!

by Javid Pasha |
లైంగిక ఆరోగ్యం : ఆ ఒక్క విషయంలో పురుషులకంటే స్త్రీలే ఎక్కువ ఎంజాయ్ చేస్తారట!
X

దిశ, ఫీచర్స్ : దాంపత్య జీవితంలో శృంగారం ఒక ముఖ్యమైన భాగం. ఆనందంగా, ఆరోగ్యంగా ఉండటంలో ఇది కీలకపాత్ర పోషిస్తుంది. లైంగిక ఆనందానికి దూరం కావడం మనస్పర్థలకు, విడాకులకు దారితీస్తున్న సందర్భాలు నేడు అనేకం చోటు చేసుకుంటున్నాయి. అందుకే పార్టనర్స్ తమ సెక్స్ జీవితానికి ప్రయారిటీ ఇవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు.

భాగస్వాములు రెగ్యులర్‌గా కలవడం సహజంగానే వారిలో ఉత్తేజానికి కారణం అవుతుంది. ఇక భార్యా భర్తలు శృంగారంలో పాల్గొన్నప్పుడు ఇద్దరిలో ఎవరు ఎక్కువ ఎంజాయ్ చేస్తారనే సందేహాలు కూడా పలువురిలో వ్యక్తం అవుతుంటాయి. అయితే 18 నుంచి 75 ఏండ్ల వయస్సుగల 1,238 మందిపై నిర్వహించిన సెక్సాలజిస్టుల ఒక అధ్యయనం ప్రకారం.. మహిళలతో పోల్చినప్పుడు పురుషుల్లో శృంగార ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. కానీ లైంగిక చర్యల్లో పాల్గొన్నప్పుడు మాత్రం పురుషులకంటే, స్త్రీలే ఆ మధుర క్షణాలను ఎక్కువగా ఎంజాయ్ చేస్తారట.

సంభోగంలో పురుషుడు ఒక్కసారి మాత్రమే ఉద్రేకానికి లోనవుతాడు. కానీ స్త్రీ శృంగార ప్రక్రియ ప్రారంభం నుంచి ముగిసే వరకు ఒకటి కంటే ఎక్కువసార్లు ఉద్రేకానికి లోనవుతుందట. నిపుణుల ప్రకారం.. సెక్స్‌లో పాల్గొన్నప్పుడు మహిళ శరీరంలోని సెన్సిటివ్ ఏరియాల్లో రక్తప్రసరణ వేగం పెరిగినప్పుడు మరింత ఉద్రేకం పొందుతారు. ఈ సందర్భంలో వారు పురుషుడికంటే ఎక్కువగా సంతృప్తి చెందుతారట.

Advertisement

Next Story

Most Viewed