శృంగారాన్ని మహిళలు ఎలా ఆస్వాదించాలి..?

by Nagaya |   ( Updated:2023-03-09 16:16:51.0  )
శృంగారాన్ని మహిళలు ఎలా ఆస్వాదించాలి..?
X

దిశ, ఫీచర్స్: చాలా మంది స్ట్రీలు లైంగిక బలహీనతతో బాధపడుతుంటారు. కానీ దీని గురించి చర్చించరు. సమస్యను వివరించే ప్రయత్నం చేయరు. ఇలాంటి సందర్భాలు లైంగిక సంబంధాల్లో ఒత్తిడికి దారితీస్తాయి. తక్కువ లైంగిక ప్రేరేపణ, లైంగిక కోరిక, ఉద్వేగం పొందలేకపోవడం, సంభోగం సమయంలో నొప్పి వంటి అనేక రకాల పరిస్థితులు ఉన్నాయి. ఇవి లైంగిక అసమర్థతలో భాగమే. పురుషులు, మహిళలు ఇద్దరూ లైంగిక అనారోగ్యాన్ని అనుభవిస్తున్నప్పటికీ.. మహిళలు దీన్ని కలిగి ఉండటం సామాజికంగా ఆమోదయోగ్యంగా భావించరు. కానీ ఫిమేల్ సెక్సువల్ డిస్‌ఫంక్షన్ (FSD) అనేది మనం అనుకున్నదానికంటే చాలా సాధారణం అంటున్నారు నిపుణులు. 30 ఏళ్ల వయస్సులో ఉన్న మహిళల నుంచి పెరిమెనోపాజ్ అయిన మహిళల వరకు ఈ సమస్యలతో సతమతం అవుతున్నారని.. విటమిన్ డి లోపం, థైరాయిడ్ రుగ్మతలు, బాధాకరమైన సంభోగం, అధిక శరీర బరువు, వ్యాయామం లేకపోవడం, హార్మోన్ ఇన్‌టేక్, ఆండ్రోజెన్ లోపం వంటివి ఇందుకు కారణమని తెలిపారు.

లైంగిక అసమర్థత లక్షణాలు:

* అత్యంత సాధారణ FSDలో లైంగిక కోరిక, ఆసక్తి లేకపోవడం ఉంటుంది.

* సెక్స్ పట్ల మీ కోరిక ఉండవచ్చు. కానీ ఉద్రేకంతో సమస్యలు ఉండొచ్చు. సెక్స్ సమయంలో ఉద్రేకం లేదా ఉద్రేకాన్ని కొనసాగించడంలో ఇబ్బంది.

* నిరంతర ఉద్దీపన ఉన్నప్పటికీ, మీరు ఉద్వేగాన్ని చేరుకోవడంలో నిరంతర కష్టాన్ని కలిగి ఉంటారు.

* లైంగిక ఉద్దీపన లేదా యోని సంపర్కం సమయంలో నొప్పిని కలిగి ఉండటం.

సమస్యలకు కారణం

* క్యాన్సర్, మల్టిపుల్ స్క్లెరోసిస్, గుండె జబ్బులు, మూత్రపిండాల వైఫల్యం లేదా మూత్రాశయ సమస్యలు వంటి వైద్య పరిస్థితులు.

* యాంటిడిప్రెసెంట్స్, యాంటిహిస్టామైన్‌లు, బ్లడ్ ప్రెజర్ మెడిసిన్, కీమోథెరపీ డ్రగ్స్ వంటి నిర్దిష్ట మందులు తీసుకోవడం.

* మెనోపాజ్ తర్వాత తక్కువ ఈస్ట్రోజెన్ స్థాయిలు లైంగిక ప్రతిస్పందనను మార్చవచ్చు. ఈస్ట్రోజెన్‌లో తగ్గుదల పెల్విస్‌కు రక్త ప్రవాహాన్ని తగ్గిస్తుంది. ఇది జననేంద్రియ కణజాలాలలో మార్పులకు కారణమవుతుంది.

* ఈస్ట్రోజెన్ లెవల్స్ తక్కువగా ఉండటం.. సన్నగా, తక్కువ సాగే యోని లైనింగ్‌కి దోహదపడుతుంది. ప్రత్యేకించి లైంగికంగా చురుకుగా లేకుంటే.. డైస్పెరూనియా (బాధాకరమైన సంభోగం)కి దారితీస్తుంది.

* గర్భధారణ తర్వాత, తల్లిపాలు ఇచ్చే సమయంలో కూడా హార్మోన్ లెవల్స్ మారుతూ యోని పొడిబారడానికి దారితీస్తాయి.

* దీర్ఘకాలిక ఒత్తిడి లేదా లైంగిక వేధింపులు

* మీ సంబంధంలో దీర్ఘకాలిక బాధ

* బాడీ ఇమేజ్‌తో సమస్యలు

* సెక్స్‌తో సాంస్కృతిక, మతపరమైన సమస్యలు

చికిత్స

* సంబంధ సమస్యలకు కౌన్సెలింగ్, లైంగిక లక్ష్యాలను నిర్దేశించడం

* ఆండ్రోజెన్ థెరపీ ముఖ్యం

* ట్రాన్స్‌డెర్మల్ టెస్టోస్టెరాన్ పాచెస్

* టెస్టోస్టెరాన్ ట్రాన్స్‌డెర్మల్ జెల్ (5 గ్రాముల చొప్పున 3 నెలలు)

* మెనోపాజ్ హార్మోన్ థెరపీ

* స్థానిక ఈస్ట్రోజెన్ జెల్, వెజినల్ మాయిశ్చరైజర్స్

ఇవి కూడా చదవండి :

గర్భం దాల్చేందుకు.. ఏ టైమ్‌లో శృంగారం చేయాలి?

స్త్రీతో సంబంధం లేదు.. ఇద్దరు అబ్బాయిలు కూడా పిల్లలను కనొచ్చు..!

Advertisement

Next Story

Most Viewed