రోజూ వంద మందితో సెక్స్ .. 249 మంది పిలల్లకు తండ్రి ! ఎవరతను? (వీడియో)

by Hamsa |   ( Updated:2023-10-10 14:59:22.0  )
రోజూ వంద మందితో సెక్స్ .. 249 మంది పిలల్లకు తండ్రి ! ఎవరతను? (వీడియో)
X

దిశ, వెబ్ డెస్క్: చరిత్ర మరువలేని మనిషి అతడు..ధైర్యసాహసాలు కలిగిన ఓ బానిస.. కేవలం పిల్లల్ని కనడానికి మాత్రమే ప్రతిరోజూ వందల మంది స్త్రీలతో బలవంతంగా సెక్స్ చేయించేవారు.. ఆ క్రమంలో 249 మంది పిల్లలకు తండ్రి అయ్యాడు.. దాదాపు 30 శాతం అక్కడి ప్రాంత జనాభా అతని పెరిగిన సంతానమంటే ఆశ్చర్యపడాల్సిందే. ఇలా చెప్తుకుంటూ పోతే చాలానే ఉన్నాయి.ఈ ప్రపంచానికి పటా సెకాగా సుపరిచితుడు.

1828 లో బ్రెజిల్ లోని సోపాలో లోని సోరోకాబాలో జన్మించి 130 ఏళ్లు బ్రతికి బ్రెజిల్ చరిత్రలో మర్చిపోలేని పాత్రగా మిగిలాడు.అసలు పేరు రోక్ జోస్ ఫ్లోరెన్సియా.. జోక్విమ్ జోస్ డి ఒలివేరా అనే ఓ భూస్వామి పటా సెకాని కిడ్నాప్ చేసి బానిసను చేసుకున్నాడు. బానిసత్వం అధికారికంగా ఉన్న ఆ కాలంలో అణచివేత దారులపై అనేకసార్లు తిరుగుబాటు చేశాడు.తనలాగే బానిసత్వం అనుభవిస్తున్న వారికి అండగా నిలబడి సంఘాలను ఏర్పాటు చేయడంలో కూడా సహాయం చేశాడు..అతని పేరు వెనకాల చాలా కథలే ఉన్నాయి. పటా సెకా అంటే పోర్చుగీస్‌లో "డ్రై ఫూట్" అని అర్థం వస్తుంది..అతని పాదాలకు పొడి చర్మం ఉండడం వల్ల ఆ పేరు వచ్చిందని కొందరు,మండుతున్న నేలపై చెప్పులు లేకుండా నడిచేవాడని మరికొందరు..ఇలా రకరకాలుగా చెబుతుంటారు.

ఏడడుగుల ఎత్తు ఉండే పటా సెకా..ధృఢమైన శరీర సౌష్టవం కలిగిన ధైర్యానికి, తెలివితేటలకు మారుపేరుగా ఉండేవాడు. 2 మీటర్లు పైగ ఎత్తు ఉండే ఇతడు.. మిగతా బానిసలు కూలి పనులు చేస్తుంటే ఇతడ్ని మాత్రం స్లేవ్ బ్రీడర్ గా ఉపయోగించే వారు..అలా రోజుకు వందల మంది మహిళతో బలవంతంగా సెక్స్ చేయాల్సి వచ్చేది.. దాని ఫలితంగానే 249 మందికి పైగా పిల్లలకు తండ్రయ్యాడని భావిస్తారు. అందులో అతని యజమానుల ద్వారా కేటాయించిన బానిస స్త్రీలకు జన్మించిన వారు ఎక్కువగా ఉంటారు.అతని ద్వారా పుట్టిన పిల్లలు అతనిలాగే దృఢంగా, ఆరోగ్యంగా ఉంటారనేది ప్రధాన కారణం.కొందరు అతన్ని ప్రేమించి శృంగారం చేస్తే.. మరికొందరు డబ్బులిచ్చి మరి అతడితో శృంగారంలో పాల్గొనేవారు.

పిల్లలను అమితంగా ప్రేమించే వాడు పటా సెకా.. అతడి లాగా బానిసలుగా కాకుండా ఉండాలని కోరుకున్నాడు..వారికి చదవడం, రాయడం ఎలాగో, పోరాడి బతకడం ఎలాగో నేర్పించాడు. జీవితపు చివరి కాలంలో పల్మిరా అనే మహిళ వివాహం చేసుకున్నాడు.పటా సెకా 130 సంవత్సరాల వయస్సులో జూన్ 13, 1958న బ్రెజిల్‌లోని శాంటా యుడోక్సియా, సో కార్లోస్, సోపాలోలో కన్నుమూశారు. పటా సెకా జీవితకాలంలో 1888లో బానిసత్వ నిర్మూలన, 1889లో గణతంత్ర స్థాపన,రెండు ప్రపంచ యుద్ధాలు, అనేక సామాజిక ఉద్యమాలు చూశాడు.

Advertisement

Next Story

Most Viewed