Insects : కీటకాల రహస్యాలు.. మనుగడకోసం ఎలా ప్రవర్తిస్తాయో గుర్తించిన శాస్త్రవేత్తలు

by Javid Pasha |
Insects : కీటకాల రహస్యాలు.. మనుగడకోసం ఎలా ప్రవర్తిస్తాయో గుర్తించిన శాస్త్రవేత్తలు
X

దిశ, ఫీచర్స్ : ఈ భూమిపై మనుషులే కాదు.. అనేక రకాల కీటకాలు, జీవ జాతులు మనుగడ సాగిస్తున్నాయి. అయితే వివిధ జంతువుల ప్రవర్తన, ఆహారపు అలవాట్లు, కార్యకలాపాల గురించి చాలా మందికి తెలుసు కానీ.. చీమలు, తేనెటీగలు, కందిరీగలు సహా విభిన్న వాతావరణ పరిస్థితుల్లో ఆయా కీటకాల బిహేవియర్ ఎలా ఉంటుంది? రాత్రింబవళ్లు ప్రకృతిలో మనుగడకోసం అవి ఏం చేస్తాయనే విషయాలు మాత్రం చాలా తక్కువ తెలుసు. కాగా రీసెంట్‌గా పశ్చిమ ఆస్ట్రేలియన్ యూనివర్సిటీకి చెందిన నిపుణుల పరిశోధన కీటకాల గురించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించింది. అవేంటో చూద్దాం.

* కీటకాల ప్రవర్తన, ఆయా పర్యావరణ పరిస్థితుల్లో వాటి కదలికలపై పరిశోధనలు చాలా కాలంగా జరుగుతున్నప్పటికీ.. గుర్తించడం సవాలుగా మారుతోందని శాస్త్రవేత్తలు అంటున్నారు. అయితే తాజా పరిశోధనల ప్రకారం.. రాత్రివేళతో పోలిస్తే డే టైమ్‌లో కీటకాల ప్రవర్తన డిఫెంట్‌గా ఉంటుందని గుర్తించినట్లు శాస్త్రవేత్తలు చెప్తున్నారు.

* వివిధ జీవుల మాదిరి కీటకాలు కూడా జీవించాలంటే వాటికి తగిన ఆహారం అవసరం. అయితే దీని కోసం అవి ఆయా పరిస్థితుల్లో భిన్నంగా ప్రవర్తిస్తుంటాయని నిపుణులు చెప్తున్నారు. ఆహార సముపార్జన, మనుగడకోసం 24 గంటల సమయంలో ఏ కీటకాలు ఎలా ప్రవర్తిస్తాయో పరిశోధకులు పరిశీలించారు. అంతేకాకుండా పర్యావరణ, వాతావరణ మార్పులు వాటిని ఎలా ప్రభావితం చేస్తాయో కూడా గుర్తించారు.

* 1959 నుంచి 2022 వరకు కీటకాల మనుగడపై పలువురు శాస్త్రవేత్తలు పరిశోధనలు నిర్వహించారు. కాగా పశ్చిమ ఆస్ట్రేలియాకు చెందిన సైంటిస్టులు ఇటీవల మరోసారి ఉష్ణమండలం, సమశీతోష్ణ వాతావరణ స్థితి కలిగిన అడవులు, శుష్క గడ్డి భూములు, జలాశయాలు పరిసరాలు, పర్యావరణ వ్యవస్థల్లో కీటకాల ప్రవర్తనను పరిశీలించారు. దాదాపు 30 లక్షల కీటకాలను వారు విశ్లేషించారు. ఈ సందర్భంగా వారు రాత్రి, పగటి వేళల్లో ఆయా కీటకాల మనుగడ పోరాటం, ప్రవర్తన భిన్నంగా ఉంటుందని కనుగొన్నారు.

*కాడిస్ ఫ్లెస్‌లు, మేఫ్లిస్, మాత్స్, ఇయర్ విగ్ వంటి కీటకాలు రాత్రిళ్లు చాలా యాక్టివ్‌గా ఉంటాయని, ఇక తేనెటీగలు, చీమలు, కందిరీగలు వంటివి పగటి పూట చురుకుగా ఉంటాయని పరిశోధకులు గుర్తించారు. ఇక నదులు, గడ్డి భూములు వంటి ప్రాంతాల్లో పగటిపూట కీటకాల సంఖ్య మూడు రెట్లు ఎక్కువగా ఉంటోందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.

* ఉష్ణోగ్రతల ప్రభావం కూడా ఆయా కీటకాలపై ప్రవర్తనపై ప్రభావం చూపుతోంది. చలి ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో కీటకాలు పగటి పూట వేడి నుంచి ఆశ్రయం పొందుతుంటే.. వెచ్చని ప్రాంతాల్లో వీటి యాక్టివిటీస్ రాత్రిళ్లు ఎక్కువగా ఉంటున్నాయని నిపుణులు అంటున్నారు. అలాగే వాతావరణ మార్పులు, గ్లోబల్ వార్మింగ్ కారణంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు భవిష్యత్తులో రాత్రిపూట కీటకాలను మరింత ఒత్తిడికి గురిచేసే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. దీనివల్ల వాటి మనుగడను, కార్యకలాపాలను ఆయా వాతావరణ పరిస్థితులు కష్టతరం చేసే అవకాశం ఉందని చెప్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed