చలికాలంలోనే COLD, FLU కేసులు ఎందుకు..? రీజన్ కనిపెట్టిన సైంటిస్టులు

by Hajipasha |   ( Updated:2022-12-08 10:01:11.0  )
చలికాలంలోనే COLD, FLU కేసులు ఎందుకు..? రీజన్ కనిపెట్టిన సైంటిస్టులు
X

దిశ, ఫీచర్స్: చలికాలంలో జలుబు, ఫ్లూ కేసుల పెరుగుదల వెనుకున్న బయోలాజికల్ రీజన్‌ను కనుగొన్న శాస్త్రవేత్తలు పురోగతి సాధించారు. చల్లని గాలి శరీరం నుంచి ముఖ్యంగా ముక్కు నుంచి బలహీనమైన రోగనిరోధక ప్రతిస్పందనకు దారితీస్తుందని గుర్తించారు. ముక్కు రెస్పిరేటరీ వైరస్‌లకు మొదటి కాంటాక్ట్, శరీర రోగనిరోధక ప్రతిస్పందనకు ముఖ్యమైనదని తాజా అధ్యయనం కనుగొంది.

వైరస్‌ ముఖ్యంగా తక్కువ ఉష్ణోగ్రతల దగ్గర ముక్కుకు హాని చేస్తుంది. కేవలం ఐదు డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతను తగ్గించడం వలన నాసికా రంధ్రాలలోని బిలియన్ల వైరస్.. బ్యాక్టీరియా-పోరాట కణాలను కనీసం 50 శాతం తగ్గించిందని శాస్త్రవేత్తలు గుర్తించారు. అంటే ఉష్ణోగ్రతలో చిన్న తగ్గుదల సగం నిరోధక శక్తిని కోల్పోయేందుకు కారణమవుతుంది. అయితే ఇలాంటి టైమ్‌లో మాస్క్‌లు చాలా హెల్ప్ చేస్తాయని తెలిపారు పరిశోధకులు. ఇవి మిమ్మల్ని వైరస్‌లను నేరుగా పీల్చడం నుంచి రక్షించడమే కాకుండా.. ముక్కుకు స్వెటర్‌లాగా పనిచేస్తూ చల్లటి గాలి నుంచి రక్షిస్తాయి.

సైంటిస్ట్ బ్లీయర్, ఆమె బృందం.. 15 నిమిషాల పాటు 4.4 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతకు గురైన నలుగురిపై ఒక అధ్యయనం నిర్వహించారు. కానీ ఈ అధ్యయనం విట్రోలో పూర్తయింది. అంటే ఇది ప్రత్యక్షంగా మానవులపై కాకుండా ప్రయోగశాలలోని మానవ కణజాలంపై జరిగింది. తక్కువ ఉష్ణోగ్రతలను ఎదుర్కొన్నప్పుడు ముక్కు డికోయ్ ఎక్స్‌ట్రాసెల్యులర్ వెసికిల్స్(EV) యొక్క రెప్లికేషన్‌ను 160 శాతం పెంచుతుందని కనుగొన్నారు.

'EVలు డికోయ్‌లుగా పనిచేస్తాయి. కాబట్టి ఇప్పుడు మీరు వైరస్‌ను పీల్చినప్పుడు.. వైరస్ కణాలకు అంటుకునే బదులు డికోయ్‌లకు అంటుకుంటుంది' అని బ్లేయర్ వివరించారు. ప్రత్యేకంగా ఈ వైరస్‌లను చంపడానికి రూపొందించబడ్డ EVలు సాధారణ కణాల వలె విభజించబడకపోగా.. అసలైన కణాల కంటే 20 రెట్లు ఎక్కువ గ్రాహకాలను కలిగి ఉంటాయి. సూక్ష్మక్రిములను ట్రాప్ చేసే సామర్థ్యాన్ని పెంచుతాయి. తదనంతరం, ఈ EVలు జెర్మ్స్‌తో పోరాడి, వాటిని శరీరం నుంచి శ్లేష్మం ద్వారా బహిష్కరిస్తాయి. అయితే, ఉష్ణోగ్రతలో మరికొన్ని డిగ్రీల తగ్గుదలకి గురైనప్పుడు EVల పనితనం 42 శాతం తగ్గిందని కూడా అధ్యయనం పేర్కొంది.

Advertisement

Next Story

Most Viewed