చంద్రునిపై కనిపించిన గ్రానైట్.. పురాతన అగ్నిపర్వతాలవల్లే ఏర్పడిందా?

by Prasanna |   ( Updated:2023-07-10 06:03:35.0  )
చంద్రునిపై కనిపించిన గ్రానైట్.. పురాతన అగ్నిపర్వతాలవల్లే ఏర్పడిందా?
X

దిశ, ఫీచర్స్ : చంద్రునిపై గల కాంప్టన్-బెల్కోవిచ్ అగ్నిపర్వత సముదాయం కింద పెద్ద గ్రానైట్‌ పరిమాణాలు ఉన్నట్లు సైంటిస్టులు కనుగొన్నారు. ప్లానెటరీ సైన్స్ ఇన్‌స్టిట్యూట్ పరిశోధకుడు మాథ్యూ సీగ్లర్ నేతృత్వంలోని శాస్త్రవేత్తలు లూనార్ రికనైసెన్స్ ఆర్బిటర్ ద్వారా సేకరించిన డేటాను ఉపయోగించి వీటిని ఎనైలైజ్ చేశారు. అయితే ఇది లూనార్ అవతలివైపు ఒకప్పుడు అగ్నిపర్వత విస్ఫోటనాలతో ఏర్పడి ఉండవచ్చని భావిస్తున్నారు. చంద్రుని ప్రాంరంభ చరిత్రలో మూన్ క్రస్ట్ ఎలా ఏర్పడిందో మరింత సమాచారం తెలుసుకోవడానికి సహాయపడుతుందని చెప్తున్నారు. జియాలజిస్టుల ప్రకారం.. 3.5 బిలియన్ సంవత్సరాల క్రితం చంద్రడిపై పెద్ద ఎత్తున అగ్ని పర్వతాల విస్ఫోటనాలతో శిలాద్రవం ఏర్పడింది. దాని శీతలీకరణ ఫలితంగానే తాజాగా కనుగొన్న గ్రానైట్ ఏర్పడి ఉండవచ్చని పరిశోధకులు అంటున్నారు. ఏదేమైనా సుమారు 31 మైళ్లు (50 కిలోమీటర్లు) వెడల్పుతో, చల్లబడిన శిలాద్రవం యొక్క పాచ్ పరిమాణాన్ని కనుగొనడం తమకు ఆశ్చర్యంగా ఉందని పేర్కొంటున్నారు.

Read More: ఎక్కువమంది మనశ్శాంతిగా ఫీలయ్యే ఏకైక ప్రదేశం ఏంటో తెలుసా?

Advertisement

Next Story