- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బ్రెయిన్ క్యాన్సర్ రోగుల జీవిత కాలాన్ని పెంచే ‘పాత్ బ్రేకింగ్’ విధానాన్ని కనుగొన్న సైంటిస్టులు
దిశ, ఫీచర్స్: భారతీయ నేతృత్వంలోని యూఎస్ సైంటిస్టులు బ్రెయిన్ క్యాన్సర్ పేషెంట్ల జీవన ప్రమాణాన్ని పెంచే పాత్ బ్రేకింగ్ ప్రక్రియను యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలోని శాన్ ఫ్రాన్సిస్కో మెడికల్ సెంటర్ సైంటిస్టుల బృందం కనుగొన్నది. క్యాన్సర్ కణాలు ఆరోగ్యకరమైన మెదడు కణాలతో కలిసి హైపర్యాక్టివ్గా మారడానికి కారణమవుతాయని, ఈ పరిస్థితి రోగులలో జ్ఞాపకశక్తి క్షీణతకు, క్రమంగా మరణం సంభవించే పరిస్థితులకు దారితీస్తుందని పేర్కొన్నది. అయితే కణితి కణాల హైపర్యాక్టివిటీని తగ్గించడంలో, వాటి పెరుగుదలను ఆపడంలో సాధారణంగా ఉపయోగించే యాంటీ-సీజర్ డ్రగ్ ప్రభావవంతంగా పనిచేసే విధానాన్ని తాము కనుగొన్నట్లు సరితా కృష్ణ నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం పేర్కొన్నది.
శాస్త్రవేత్తలు ఆరోగ్యకరమైన మెదడు కణాలు, క్యాన్సర్ కణాల మధ్య కమ్యూనికేషన్ తారుమారు చేసి కణితి యొక్క పెరుగుదలను ఆపడానికి ప్రయత్నించారు. మెదడు క్యాన్సర్లలో అత్యంత ప్రాణాంతకంగా పరిగణించబడే గ్లియోబ్లాస్టోమా(glioblastoma) ఉన్న రోగులకు ఈ పరిశోధనలు మరింత ప్రయోజనకరంగా ఉంటాయని వారు పేర్కొన్నారు. యూఎస్ సైంటిస్టుల బృందానికి నేతృత్వం వహించిన, కేరళ రాష్ట్రం, తిరువనంతపురం నివాసి అయిన డాక్టర్ కృష్ణ, తోటి శాస్త్రవేత్త షాన్ హెర్వే-జంపర్(Shawn Hervey-Jumper)కలిసి నిర్వహించిన అధ్యయనంలో మెదడు కణితుల హైజాక్, బ్రెయిన్ సర్క్యూట్రీని మోడిఫై చేయడం ద్వారా గ్లియోమా క్యాన్సర్ రోగులలో మెదడు కార్యకలాపాలను పరిశీలించారు. జ్ఞాపకశక్తి క్షీణతకు కారణమయ్యే, గతంలో తెలియని మెకానిజంను ఈ సందర్భంగా తాము కనుగొన్నట్లు అతను వెల్లడించాడు.
మెదడు ఆర్గానాయిడ్లను అంటే.. మానవ మూలకణాల నుంచి తీసుకోబడిన న్యూరాన్ల యొక్క స్మాల్ బండెల్స్, హ్యూమన్ గ్లియోబ్లాస్టోమా కణాలతో రూపొందించిన మౌస్ నమూనాలను ఉపయోగించి, కనెక్ట్ చేయబడిన కణితి కణాలకు సంబంధించిన విస్తృతమైన జీవ లక్షణాన్ని శాస్త్రవేత్తలు పరిశీలించారు. ఈ ప్రయోగాలు న్యూరానల్ హైపెరెక్సిబిలిటీలో ‘థ్రోంబోస్పాండిన్-1’ అనే ప్రోటీన్ యొక్క కీలక పాత్రను వెల్లడించాయి. సాధారణంగా ఉపయోగించే యాంటీ-సీజర్ ఔషధమైన గబాపెంటిన్, న్యూరోనల్ హైపెరెక్సిటిబిలిటీని విజయవంతంగా తగ్గించి, కణతుల పెరుగుదలను సమర్థవంతంగా అడ్డుకున్నాయని అధ్యయనకర్తలు పేర్కొన్నారు. దీని ద్వారా గ్లియోబ్లాస్టోమా వంటి ప్రాణాంతక మెదడు క్యాన్సర్లకు మరింత సమర్థవంతమైన చికిత్సా పద్ధతులను అభివృద్ధి చేయడంలో ఈ ఆవిష్కరణ తోడ్పడుతుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.
Read More: ఎండాకాలం వీటిని తింటే ఏ రోగాలు కూడా దరిచేరవు!
ప్రమాదకరంగా ప్రపంచ ఉష్ణోగ్రతలు.. ఐదేళ్లలో 66 శాతం పెరిగే అవకాశం !