- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఏటా ఎంత కార్బన్ డై యాక్సైడ్ తొలగించబడుతుందో తెలుసా?
దిశ, ఫీచర్స్: ప్రతి ఏటా సుమారు రెండు బిలియన్ టన్నుల కార్బన్ డై యాక్సైడ్ వాతావరణం నుంచి తొలగించబడుతుందని శాస్త్రవేత్తలు మొదటిసారిగా లెక్కించారు. కానీ ఇది దాదాపు అడవులకే పరిమితమైనట్లు తెలిపారు. పారిస్ ఒప్పందం ప్రకారం గ్లోబల్ హీటింగ్ తగ్గించాలంటే CO2ను రిమూవ్ చేసేందుకు 2050 నాటికి సరికొత్త టెక్నాలజీలు డెవలప్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. అంతేకాదు చెట్లు, నేలల నుంచి రెండు రెట్ల కార్బన్ డై యాక్సైడ్‌ను తొలగించాల్సిన అవసరం ఉందన్నారు.
అతిపెద్ద CO2 సింక్‌లు ఏమిటి?
వాతావరణం నుంచి గ్రీన్‌హౌస్ వాయువును సంగ్రహించడం.. భూమి, సముద్రం, భౌగోళిక నిర్మాణాలు, ఉత్పత్తులలో ఎక్కువ కాలం నిల్వ చేయడం ద్వారా CO2 తొలగింపు (CDR) ప్రక్రియ జరుగుతుంది. ఇప్పటి వరకు 'భూమిపై సాంప్రదాయ CDR' ద్వారా విజయవంతంగా 99.9 శాతం CO2ను తొలగించారు శాస్త్రవేత్తలు. కొత్త అడవులను సృష్టించడం, గతంలో అటవీ నిర్మూలనకు గురైన వాటిని పునరుద్ధరించడం, నేలలను మెరుగ్గా నిర్వహించడం, మరింత మన్నికైన కలప ఉత్పత్తులను ఉపయోగించడం వంటివి ఇందులో ఉన్నాయి.
కానీ ప్రస్తుతం కార్బన్ క్యాప్చర్, స్టోరేజ్‌తో బయోఎనర్జీ, బయోచార్, డైరెక్ట్ ఎయిర్ కార్బన్ క్యాప్చర్, స్టోరేజ్ వంటి నావెల్ CDR మెథడ్స్ నుంచి 0.1 శాతం మాత్రమే వస్తుంది. ఇది క్రిటికల్ రియాలిటీ చెక్.. కానీ కొత్త కార్బన్ తొలగింపు పద్ధతులు చెట్లు, నేలల కంటే ఎక్కువ మన్నికైన నిల్వను అందించగలవని పరిశోధకులు గమనించారు. గ్లోబల్ వార్మింగ్‌ను 1.5C లేదా 2Cకి పరిమితం చేయాలంటే 2020-2100 మధ్య కార్బన్ తొలగింపు స్థాయిలలో 450 నుంచి 1,100 GtCO2 వరకు పెరుగుదలను కలిగి ఉండాలని గుర్తించారు.
2020 నుంచి 2022 వరకు కొత్త CO2 తొలగింపు సామర్థ్యంలో ప్రపంచ పెట్టుబడి మొత్తం $200 మిలియన్లు. కానీ పారిస్ ఒప్పందం లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఉద్గారాలను తగ్గించమే ప్రధాన ప్రాధాన్యతగా మిగిలిపోయింది. అదే సమయంలో CO2 తొలగింపు నావెల్ మెథడ్స్‌ను దూకుడుగా అభివృద్ధి చేయాలి. గత డిసెంబరులో US డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎనర్జీ $3.7 బిలియన్ల CO2 తొలగింపు ప్రాజెక్టులకు ఆర్థిక సహాయం చేసింది. అదే సమయంలో యూరోపియన్ యూనియన్ 2030 నాటికి ఏటా ఐదు మిలియన్ టన్నుల CO2ను క్యాప్చర్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.