Tollywood: 2024 లో టాలీవుడ్ ను షేక్ చేసిన బ్లాక్ బస్టర్ మూవీస్ ఏంటో తెలుసా

by Prasanna |
Tollywood: 2024 లో  టాలీవుడ్ ను షేక్ చేసిన బ్లాక్ బస్టర్ మూవీస్ ఏంటో తెలుసా
X

దిశ, వెబ్ డెస్క్ : ప్రతీ ఏడాది ఎన్నో సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. 2024 లో తెలుగు సినీ ఇండస్ట్రీ నుంచి మంచి సినిమాలు వచ్చాయి. జనవరిలో ‘హనుమాన్’ మూవీ నుంచి మొదలు పెడితే.. డిసెంబర్ లో పుష్ప 2తో వరకు హిట్ సినిమాలు వస్తూనే ఉన్నాయి. ఈ ఇయర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ ఇవే..

తేజ సజ్జ హీరోగా, ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన సినిమా ‘హనుమాన్’. సంక్రాంతి కానుకగా రిలీజ్ అయి స్టార్ సినిమాలను సైతం వెనక్కి నెట్టి బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. ఈ మూవీ చిన్న సినిమాగా రిలీజ్ అయి పెద్ద హిట్ గా నిలిచింది. ఈ మూవీ వరల్డ్ వైడ్ గా రూ. 132 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి 2024 టాలీవుడ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన మూవీ ‘కల్కి 2898 AD’. ఈ మూవీ వరల్డ్ వైడ్ గా గా రూ. 1111 కోట్ల గ్రాస్ సాధించి 2024లో బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘దేవర పార్ట్ 1’. ఈ సినిమా ఓవరాల్ గా రూ. 501 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఈ మూవీ 2024లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. క.. కిరణ్ అబ్బవరం హీరోగా సుజిత్ - సందీప్ డైరెక్షన్ చేసిన మూవీ ‘క’. ఈ మూవీ దీపావళి కానుకగా విడుదలయి సూపర్ హిట్ గా నిలిచింది. పుష్ప 2 ది రూల్ సుకుమార్ డైరెక్షన్ లో వచ్చిన సినిమా ‘పుష్ప 2 ది రూల్’. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ. 1500 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

Advertisement

Next Story

Most Viewed