ఉప్పు మరీ తక్కువ తింటున్నారా.. అయితే ఈ సమస్యలు తప్పవు

by Prasanna |   ( Updated:2023-01-08 14:12:42.0  )
ఉప్పు మరీ తక్కువ తింటున్నారా.. అయితే ఈ సమస్యలు తప్పవు
X

దిశ, ఫీచర్స్ : ఉప్పు ఎక్కువ తింటే మంచిది కాదు, అలాగే మరీ తక్కువ తిన్నా ఇబ్బందే అంటున్నారు ఆహార నిపుణులు. చాలామంది బీపీ పెరుగుతుందనే కారణంతో ఈ మధ్య కూరల్లో ఉప్పును తగ్గిస్తున్నారు. అస్సలు ఉప్పు వాడకుండా వంటలు చేసేవారు కూడా లేకపోలేదు. అయితే ఇలా వాడకపోవడమనేది కూడా ప్రమాదమేనట. ఎందుకంటే ఆహారంలో తగినంత ఉప్పు వాడటం తగ్గితే శరీరానికి అవసరమైన థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తి కాదు. దీనివల్ల హైపో థైరాయిడిజం సమస్య ఏర్పడుతుంది. క్రమంగా నిద్రలేమి, హఠాత్తుగా గుండె కొట్టుకోవడం, బరువు తగ్గడం వంటి సమస్యలు రావచ్చు. అంతేకాదు ఉప్పులోని 'అయోడిన్' అనే మూలకం శరీరానికి చాలా అవసరం. అలాగే విటమిన్ D, B12, మెగ్నీషియం, ఐరన్ తగినంత మోతాదులో శరీరానికి అందేలా తోడ్పుడుతుంది ఉప్పు. అందుకే తగిన మోతాదులో వాడటమే మంచిదంటున్నారు నిపుణులు.

Advertisement

Next Story