Safest city in the world : ప్రపంచంలోనే సురక్షితమైన నగరం ఇదే.. స్పెషాలిటీ ఏంటంటే..

by Javid Pasha |
Safest city in the world : ప్రపంచంలోనే సురక్షితమైన నగరం ఇదే.. స్పెషాలిటీ ఏంటంటే..
X

దిశ, ఫీచర్స్ : ఈ మధ్య ఎక్కడ చూసినా ప్రమాదాలు, నేరాలు, ఘోరాలకు సంబంధించిన వార్తలు తరచుగా వినిపిస్తున్నాయి. మెట్రో సిటీస్‌లోనూ భద్రతా పరమైన సమ్యలు తలెత్తుతున్నాయి. దీంతో ప్రజలు, టూరిస్టులు నివసించడం, సందర్శించడం వంటి విషయాల్లో సేఫ్టీకి సంబంధించిన ఆందోళనలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచంలోకెల్లా సురక్షితమైన నగరమేది? అనే సందేహాలు కూడా పలువురిలో వ్యక్తంగా అవుతున్నాయి. నిపుణుల ప్రకారం ఆ వివరాలేంటో చూద్దాం.

అన్ని విధాలా సేఫ్‌గా ఉండే ప్రాంతం లేదా దేశానికి వెళ్లిరావాలని అనుకోవడం సహజమే. ముఖ్యంగా టూరిస్టులు ఈ విషయంలో ఇంట్రెస్ట్ చూపుతుంటారు. కాగా భద్రతా రీత్యా సురక్షిత నగరం ఏదని చూసినప్పుడు వరల్డ్ క్రైమ్ అండ్ సేఫ్టీ ఇండెక్స్ ప్రకారం.. అబుదాబి ఫస్ట్ ప్లేస్‌లో ఉంది. ఈ నగరాన్ని ప్రపంచంలో భద్రతా పరంగా 88.2, నేరాల పరంగా11.8 స్కోర్‌లతో ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ గ్లోబల్ లైవ్ బిలిటీ ఇండెక్స్ ప్రజలందరూ సురక్షితంగా నివసించగలిగే, సందర్శించగలిగే సురక్షిత నగరంగా పేర్కొన్నది.

నేరాల పరంగా చూసినా అబుదాబిలో క్రైమ్ రేట్ చాలా తక్కువట. దీంతో ఇది వరల్డ్ ఫేమస్ అంట్ సేఫ్టీ టూరిస్ట్ దేశంగా ప్రసిద్ధి చెందింది. అయితే ఇక్కడ సందర్శించదగిన అనేక ప్రదేశాలు ఉన్నాయి. వీటిలో ఎక్కడ కూడా వేధింపులు, దొంగతనాలు, ప్రజలను తప్పుదోబ పట్టించడం వంటి నేరాలు, భద్రతాపరమైన సమస్యలు ఉండవని నిపుణులు చెప్తున్నారు.

ఇక టూరిస్టులు సందర్శించడానికి ఆసక్తి చూపే ప్రాంతాల విషయానికి వస్తే అబుదాబిలోని ఐలాండ్ -యాస్ ద్వీపం, ఫెరారీ వరల్డ్, యాస్ వాటర్ ల్యాండ్, ఆక్వా పార్క్, బ్రదర్ థీమ్స్, ఇండోర్ వార్నర్, యాస్ మాల్, మెరీనా ఫార్ములా వంటి ప్రదేశాల్లో ఎటువంటి భయం లేకుండా తిరగవచ్చు. అట్లనే లివా ఒసాయసిస్ అనే పురాతన సంప్రదాయ గ్రామం కూడా ఇక్కడ ఫేమస్. ఎక్కువగా ఎడారినే కనిపించే ఈ ప్రాంతంలో సఫారీ జీపులోనో, ఒంటెపైనో తిరిగి చూడవచ్చు. వెన్నెల రాత్రుల్లో ఈ ఏడారిలో ఎంజాయ్ చేసేందుకు చాలా మంది టూరిస్టులు వస్తుంటారు. అయినా భద్రతా పరమైన సమస్యలు ఉండవు. వీటితోపాటు అబుదాబిలో ఇంకా అనేక పర్యాటక ప్రాంతాలు ఆకట్టుకోవడమే కాకుండా సందర్శించడానికి సేఫ్‌గా ఉంటాయి. ఇక సురక్షితమైన నగరాల జాబితాలో అబుదాబి తర్వాత అజ్మాన్, దోహ, తైపీ, దుబాయ్ వరుసగా రెండు నుంచి ఐదవ స్థానంలో నిలిచాయి.

Advertisement

Next Story

Most Viewed