Air pollution: గాలి కాలుష్యంతో బ్రెయిన్ స్ట్రోక్‌ వచ్చే ప్రమాదం.. తాజా అధ్యయనంలో వెల్లడి!

by Anjali |
Air pollution: గాలి కాలుష్యంతో బ్రెయిన్ స్ట్రోక్‌ వచ్చే ప్రమాదం.. తాజా అధ్యయనంలో వెల్లడి!
X

దిశ, వెబ్‌డెస్క్: ‘గాలి కాలుష్యం అనేది వాతావరణం యొక్క సహజ లక్షణాలను సవరించే ఏదైనా రసాయన, భౌతిక లేదా జీవసంబంధమైన ఏజెంట్ ద్వారా అంతర్గత లేదా బాహ్య వాతావరణాన్ని కలుషితం చేయడం’. గ్లోబల్ వార్మింగ్‌ను నివారించడానికి చెట్టను నరికివేయకుండా.. మొక్కలు నాటాలని చెబుతూనే ఉంటారు. మొక్కలు కిరణజన్య సంయోగక్రియ సమయంలో కార్బన్ డై ఆక్సైడ్‌ను తీసుకోవడం అలాగే ఆక్సిజన్‌ను రిలీజ్ చేయడం వల్ల గాలిని శుద్ధి చేయగలవు. ఇది గ్రీన్‌హౌస్ ప్రభావాన్ని తగ్గిస్తుంది.

అయితే గాలి కాలుష్యం వల్ల పలు ఆరోగ్య సమస్యలు ఎదురవుతున్నాయని.. అందులో ముఖ్యంగా బ్రెయిన్ స్ట్రోక్ కు కారణమవుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇక ప్రజెంట్ డేస్‌లో బ్రెయిన్ స్ట్రోక్ తో చాలా మంది మరణిస్తున్నారు. ఇప్పటివరకు జీవన శైలిలో మార్పుల కారణంగా అని చాలా మంది భావించారు. కానీ దీనికి ప్రధాన కారణం గాలి కాలుష్యమని తాజాగా నిపుణులు వెల్లడించారు. బ్రెయిన్ స్ట్రోక్ మరణాలు ఎక్కువవ్వడానికి మెయిన్ రీజన్ అధిక ఉష్ణోగ్రతలు కూడా ఓ కారణమని లాన్సెట్ న్యూరాలజీ జర్నల్ పేర్కొంది.

గమనిక: పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. కేవలం మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించగలరు.

Next Story

Most Viewed