- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
RAPE - GARUDA PURAN : అమ్మాయిపై అత్యాచారం చేస్తే గరుడ పురాణం ప్రకారం పడాల్సిన భయంకరమైన శిక్ష.. వైరల్ అవుతున్న ఫొటోస్
దిశ, ఫీచర్స్ : కోల్‌కతాలో జూనియర్ డాక్టర్‌పై జరిగిన అత్యాచారం, హత్య ఘటనపై న్యాయం కోసం పోరాటాలు జరుగుతున్నాయి. విధులు బహిష్కరించి ఆందోళనకు దిగారు వైద్యులు. కానీ నిందితుడు మాత్రం మరో చోట ఉన్నత స్థానంలో కొనసాగుతున్నాడు. అసలు తప్పే చేయనట్లుగా సాధారణ జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. కాగా ఈ కేసు సీబీఐకి అప్పగించినట్లు తెలుస్తుండగా.. ఈ ఘటన మరవకముందే కేరళలో నర్సుపై రేప్ ఆందోళన కలిగిస్తోంది. ఆడపిల్లలు బయటకు వెళ్లాలంటే భయపడే రోజులు వచ్చాయి. ఇలా జరగకుండా ఉండాలంటే గరుడ పురాణం ప్రకారం శిక్షలు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నవారి సంఖ్య నెట్టింట పెరిగిపోయింది. ఇందుకు సంబంధించిన పోస్టులు వైరల్ అవుతున్నాయి.
పద్దెనిమిది హిందూ పురాణాల్లో గరుడ పురాణం ఒకటి. కాగా మహావిష్ణువు తన వాహన పక్షిరాజు గరుడకు తప్పు చేస్తే ఎలాంటి శిక్షలు విధించాలో ఇందులో చెప్పుకొచ్చాడు. అబద్ధాలు చెప్పడం నుంచి మోసం చేయడం, కామంతో చూడడం వరకు ఇందులో పదహారు శిక్షలు ఉన్నాయి.ఈ జన్మలో తప్పు చేస్తే మరణం తర్వాత పడే శిక్షలు మిమ్మల్ని వదిలిపెట్టవని హెచ్చరిస్తుంటాయి. ఈ క్రమంలోనే ఒక అమ్మాయిని బలవంతంగా రేప్ చేస్తే పడే శిక్షకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. దీనినే లాలాభక్ష నరకం అని పిలుస్తుండగా.. దోషిని సంకెళ్లతో కట్టేసి జైలులో పడుకోబెట్టి.. ప్రైవేట్ పార్ట్‌పై మంట పెట్టడం.. చూడొచ్చు.ఇక ఇలాంటి శిక్షలు అమలు చేస్తే భయపడిపోతారని.. తప్పు చేసేందుకు జంకుతారని అభిప్రాయపడుతున్నారు నెటిజన్లు.