Rice Prices Hike In India: సామాన్యులకు మరో షాకింగ్ న్యూస్.. భారీగా పెరగనున్న బియ్యం ధరలు

by Kavitha |
Rice Prices Hike In India: సామాన్యులకు మరో షాకింగ్ న్యూస్.. భారీగా పెరగనున్న బియ్యం ధరలు
X

దిశ, వెబ్‌డెస్క్: సామాన్యులకు మరో బిగ్ షాక్ తగలనుంది. ఇప్పటికే నిత్యావసర సరుకులు, ఆయిల్, పప్పు ధరలు భారీగా పెరగడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అదేవిధంగా ఉల్లి ధరలు సైతం పెరగడంతో సామాన్యులు భగ్గుమంటున్నారు. ఈ తరుణంలో సామాన్యులపై మరో భారం పడనుంది. అదేంటంటే..?

దేశంలో బియ్యం ధరలు భారీగా పెరగనున్నాయి. ప్రస్తుతం సోనామసూరి, హెచ్ఎంటీ, బీపీటీ తదితర సన్న బియ్యం ధరలు కిలోకు రూ. 60 నుంచి 70 వరకు ఉన్నాయి. అయితే బాస్మతి యేతర బియ్యం ఎగుమతులపై నిషేధాన్ని ఎత్తేయడంతో బియ్యం రేట్లు భారీగా పెరగనున్నాయి. పారా బాయిల్డ్, బ్రౌన్ రైస్ పై ఎగుమతి సుంకాన్ని 20 నుంచి 10 శాతానికి తగ్గించడంతో ఈ ప్రభావం పడనుందని అనుకుంటున్నారు. మరోవైపు దేశంలో తెలుగు రాష్ట్రాలతో పాటు పలు రాష్ట్రాల్లో సంభవించిన వరదలతో పంట నష్టం, వరిసాగు తగ్గడంతో బియ్యం రేట్లు పెరుగుదలకు కారణంగా తెలుస్తోంది. మారుతున్న కాలంతో పాటు నిత్యావసర వస్తువుల ధరలు పెరగడంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాగా బాస్మతి బియ్యం ధరల్లో మాత్రం పెద్దగా మార్పు ఉండదని తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed