- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రోబోలన్నీ అమ్మాయిల పోలికతోనే ఉంటాయి.. రీజన్ ఏంటో తెలుసా?
దిశ, ఫీచర్స్: మోడర్న్ టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది. అనేక రంగాల్లో ఏఐ ద్వారా రూపొందించిన రోబోలు అద్భుతాలు చేస్తున్నాయి. ప్రపంచంలోనే ఫస్ట్ అల్ట్రా రియలిస్టిక్ హ్యుమనాయిడ్ ఆర్టిస్ట్ రోబో పేరు ‘ఐడా’ అయితే, తొలి నర్సింగ్ అసిస్టెంట్ రోబో పేరు ‘గ్రేస్’. వీటితోపాటు సోఫియా, నాడిన్, మికా, డెస్డెమోనా వంటి రోబోస్ ఆ తర్వాత వరుసగా అందుబాటులోకి వచ్చాయి. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటుంది. ఏంటంటే.. ఇప్పటి వరకు తయారు చేసిన ఈ రోబోలన్నింటిలో అత్యధికంగా అమ్మాయిలను పోలిన డిజైన్తో కూడినవే అధికంగా ఉన్నాయి. అయితే వాటికి స్త్రీ లక్షణాలు మాత్రమే ఎందుకిచ్చారు? మగ రోబోలు ఎందుకు తయారు చేయడం లేదు అనే విషయాలు ఇటీవల సోషల్ మీడియాలో చర్చకు వస్తున్నాయి. పురుషాధిక్య, పితృస్వామిక భావజాలం టెక్నాలజీలోనూ కనిపిస్తోందని పలువురు విమర్శిస్తున్నారు.
నాడిన్ రోబో తయారీ వెనుక..
లింగ వివక్షలో భాగంగానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వాయిస్ సిస్టమ్ రోబోలకు స్త్రీ రూపం ఇస్తారనే ఆర్గ్యుమెంట్ కూడా నడుస్తోంది. కానీ నిపుణులు వీటిని కొట్టిపారేస్తున్నారు. సాధారణంగా డిజైనర్లు తమను పోలిన లేదా నచ్చిన రోబోలను తయారు చేయడానికి ఇష్టపడుతుంటారని చెప్తున్నారు. ఇప్పటి వరకు వాటిని రూపొందించిన వారు ఎక్కువగా మహిళలే కావడం వల్ల సహజంగానే స్త్రీ రూపం ఇచ్చి ఉంటారని భావిస్తున్నారు. అయితే నాడిన్ అనే ఆడ రోబో గురించి పరిశీలిస్తే గనుక దీని రూపకర్త ఒక మహిళ. ఆమె పేరు నాడియా మాగ్నెనాట్ థల్మాన్. తన ఇంట్రెస్ట్ కొద్దీ దీనికి స్త్రీ రూపం ఇచ్చారట. పైగా తనను తాను ఒక ‘రోబో సెల్ఫీ’గా భావిస్తున్నట్లు ఆమె గతంలో పేర్కొన్నారు.
మార్కెట్ ఇంట్రెస్ట్ మరోలా ఉందా?
ఆయా రంగాల్లో ఏఐ సహకారాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో గతంలో జెనీవాలో ఐక్య రాజ్య సమితి ఒక సదస్సు నిర్వహించింది. ఈ సమావేశంలో స్త్రీ రూపం కలిగిన హ్యుమనాయిడ్ రోబోలతోపాటు పురుష రూపం ఉన్న జెమినాయడ్ రోబోలను కూడా హాజరు పర్చిన విషయాన్ని గుర్తు చేస్తూ, ఇక్కడ లింగ వివక్షకు తావులేదని జెమినాయడ్ అనే మగ రోబో సృష్టికర్త హిరోషి ఇషిగురో పేర్కొన్నాడు. కాగా టెక్నాలజీ నిపుణుల్లో లింగ వివక్ష భావజాలం లేనప్పటికీ ప్రపంచ మార్కెట్ ఇంట్రెస్ట్ను బట్టి కూడా స్త్రీ ఆకారాన్ని పోలిన రోబోల తయారీపై ఆయా సంస్థలు, నిపుణులు ఆసక్తి చూపుతున్నట్లు మరికొందరు వాదిస్తున్నారు. ఎక్కువమంది ఉమెన్ వాయిస్ను, రూపాన్ని ఇష్టపడటం మూలంగా టెక్నాలజీలోనూ ఆ ప్రభావం కనిపిస్తున్నట్లు అమెరికాలోని ఇండియానా యూనివర్సిటీకి చెందిన రోబోటిక్స్ అండ్ హ్యూమన్ కంప్యూటర్ ఇంటరాక్షన్ ఎక్స్పర్ట్ అయిన మెక్ డోర్మన్ అంటున్నాడు. అయినప్పటికీ స్త్రీని ఒక మార్కెట్ వస్తువుగా, లైంగిక వస్తువుగా చూసే ధోరణి టెక్నాలజీ విషయంలోనూ కనిపిస్తోందనిపలువురు స్త్రీ వాదులు పేర్కొంటున్నారు.
Read More: నిద్రకు.. మరణానికి లింకేంటి.. నిపుణులేం చెప్తున్నారు?