- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Health Tips : నెలకు రెండుసార్లు పీరియడ్స్.. కారణం అదే అంటున్న నిపుణులు..
దిశ, వెబ్‌డెస్క్ : ప్రతి స్త్రీకి ఒక నిర్దిష్ట వయస్సు తర్వాత పీరియడ్స్ రావడం మొదలవుతుంది. ప్రతి స్త్రీ ఋతు చక్రం భిన్నంగా ఉంటుంది. ఈ పీరియడ్ సైకిల్ 28 రోజుల నుండి 45 రోజుల వరకు సాధారణమైనదిగా పరిగణిస్తారు. అంటే ఈ వ్యవధిలో స్త్రీకి రుతుక్రమం వస్తుంది. కానీ చాలా మంది స్త్రీలకు నెలలో రెండుసార్లు పీరియడ్స్ వస్తుంటాయి. ఇది సాధారణ సమస్య అస్సలే కాదంటున్నారు నిపుణులు. తరచూ ఇలాగే జరిగితే తప్పకుండా వైద్యులను సంప్రదించాలంటున్నారు నిపుణులు. ఇంతకీ ఇలా ఎందుకు జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
నెలకు రెండుసార్లు పీరియడ్స్ ?
ఈస్ట్రోజెన్, ప్రొజెస్టిరాన్ హార్మోన్లు మహిళల్లో పీరియడ్స్ ను నియంత్రిస్తాయంటున్నారు సీనియర్ గైనకాలజిస్టులు. అస్తవ్యస్త జీవనశైలి కారణంగా, గర్భాశయం పరిమాణంలో మార్పు, ఈ హార్మోన్ల సమతుల్యత మారుతుందని చెబుతున్నారు. దీని కారణంగా పీరియడ్స్ చక్రంలో కూడా మార్పులు కనిపిస్తాయట. చాలా మంది మహిళల్లో పీరియడ్స్ సక్రమంగా రాకపోవడానికి ఇదే కారణమంటున్నారు. హార్మోన్లలో ఏదైనా అసమానత పీరియడ్స్‌ను ప్రభావితం చేస్తుందంటున్నారు. ఇది నెలకు రెండుసార్లు పీరియడ్స్‌కు దారి తీస్తుందట. అలాగే ఇది సాధారణమైన సమస్య కాదని, ఇలా జరిగితే కచ్చితంగా వైద్యుడిని సంప్రదించాలి.
ఒత్తిడి కూడా కారణం..
చాలా మంది మహిళల్లో హార్మోన్లతో పాటు ఒత్తిడి కూడా ఇందుకు ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. ఒత్తిడి మన హార్మోన్ల పై చెడు ప్రభావాన్ని చూపుతుంది. అందుకే ఎక్కువ ఒత్తిడికి లోనయ్యే మహిళల్లో పీరియడ్స్‌లో లోపాలు ఎక్కువగా కనిపిస్తాయని చెబుతున్నారు.
థైరాయిడ్ కూడా ఒక కారణం..
థైరాయిడ్ వల్ల కూడా పీరియడ్స్ లో అవకతవకలు జరుగుతాయంటున్నారు నిపుణులు. వాస్తవానికి, పీరియడ్స్‌ను నియంత్రించే ప్రొజెస్టెరాన్, ఈస్ట్రోజెన్ హార్మోన్లు థైరాయిడ్ గ్రంధిలో మాత్రమే ఉత్పత్తి అవుతాయి. అందువల్ల, థైరాయిడ్ సంబంధిత సమస్యలు ఉన్న స్త్రీలకు ఎక్కువగా పీరియడ్స్ సక్రమంగా రాకుండా ఉంటాయి. హైపర్ థైరాయిడిజం విషయంలో, పీరియడ్స్ ఆలస్యం అవుతుంది. అయితే హైపోథైరాయిడిజంలో నెలకు రెండుసార్లు పీరియడ్స్ రావచ్చు, పీరియడ్స్ సమయంలో అధిక రక్తస్రావం కూడా జరగవచ్చంటున్నారు నిపుణులు.
మీకు ఇలాంటి సమస్యలు ఎదురైతే ఆలస్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించాలి. కొన్ని పరీక్షల సహాయంతో డాక్టర్ దాని వెనుక ఉన్న కారణాన్ని కనుగొని చికిత్స మొదలు పెడతారు. హార్మోన్లు సక్రమంగా ఉండి పీరియడ్స్ క్రమబద్ధీకరించబడతాయి. ఒత్తిడి ప్రతి హార్మోన్ పై చెడు ప్రభావాన్ని చూపుతుంది, కాబట్టి హార్మోన్లను సరిచేయడానికి ఒత్తిడిని తగ్గించుకోవడం కూడా ముఖ్యం అంటున్నారు నిపుణులు. దీని కోసం యోగా, ధ్యానం చేయాల్సి ఉంటుంది. హార్మోన్ల మందులను తీసుకోవడం ద్వారా హార్మోన్ల అసమానతలను తొలగించవచ్చు.
* గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. పాఠకుల అవగాహనకోసం మాత్రమే అందిస్తున్నాం. నిర్ధారణలు, పర్యవసనాలకు ‘దిశ’ బాధ్యత వహించదు. ఆరోగ్యానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకునే ముందు తప్పకుండా నిపుణులను సంప్రదించగలరు.