- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అప్పగింతల కార్యక్రమంలో గుండెను పిండేసేలా ఏడుస్తున్న రాధిక మర్చంట్.. వీడియో వైరల్
దిశ, ఫీచర్స్: అపర కుబేరుడు, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, ప్రముఖ వ్యాపార వేత్త మర్చంట్ వీరెన్ కుమార్తె రాధిక మర్చంట్‌ని జూలై 12న అంగరంగ వైభవంగా ముంబైలోని జియో వరల్డ్ కాన్వెన్షన్ సెంటర్‌లో వివాహమాడారు. అనంత్ అంబానీ రాధికల పెళ్లికి.. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్‌ల నుంచి నటీనటులు అలాగే రాజకీయా, క్రీడారంగాలకు చెందిన దిగ్గజాలు సైతం ఈ పెళ్లికి హాజరయ్యారు. పెళ్లికి వచ్చిన వారందరినీ కూడా అంబానీ కుటుంబం ఎంతో ఆప్యాయంగా మర్యాదలకు ఏ లోటు రాకుండా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు.
అదేవిధంగా రాధిక మర్చంట్ అప్పగింత కార్యక్రమం కూడా ఎంతో ఎమోషనల్‌గా జరిగింది. ప్రతి అమ్మాయి జీవితంలో ఈ కార్యక్రమం అనేది భావేద్వేగమైనది. ఇక అందరి జీవితంలో లాగానే రాధిక కూడా తన తల్లిదండ్రులను విడిచి వెళ్లే సమయం రానే వచ్చింది. దీంతో ఆమె తన తండ్రిని చూస్తూ ఎంతో ఎమోషనల్ అయ్యారు. వారితో గడిపిన మధురానుభూతులు గుర్తు చేసుకుని ఏడ్చారు. అలా ఏడుస్తున్న కోడలిని చూసి, ముఖేష్ అంబానీ కూడా భావోద్వేగానికి గురయ్యారు. దీంతో వీరి పరివారమంతా ఒకరి కోసం మరొకరు అన్నట్లుగా వీరి అప్పగింతల కార్యక్రమం సాగింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట ట్రెండింగ్‌లో నిలిచింది.