- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
బాత్‌రూమ్‌లో అలా చేస్తూ దొరికిపోయిన ఆర్జీవీ హీరోయిన్.. ఓ చేతిలో మద్యం.. మరో చేయి అక్కడ..

దిశ, ఫీచర్స్ : బోల్డ్ బ్యూటీ రాధికా ఆప్టే.. ఈ మధ్యే తల్లిగా ప్రమోట్ అయింది. న్యూ మామ్ స్ట్రగుల్స్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. వర్క్, లైఫ్ బ్యాలెన్స్ చేయడంలో ఎంత కష్టం ఉంటుందో చెప్తూ.. ప్రెస్టీజియస్ BAFTA అవార్డ్స్ ఫంక్షన్‌లో జరిగిన చిన్న విషయాన్ని పంచుకుంది. కానీ అది కాస్త పెద్ద కాంట్రవర్సీకి కారణమైంది. ఈ ఈవెంట్‌లో పాల్గొన్న ఆమె.. వాష్ రూమ్‌లో బ్రెస్ట్ పంప్ చేస్తున్న పిక్ షేర్ చేసింది. కానీ ఇందులో ఒక చేతిలో బ్రెస్ట్ పంప్.. మరో చేతిలో ఆల్కహాల్ ఉండటం ట్రోలింగ్ ఎదుర్కొనేలా చేసింది. నిజానికి ఈ పిక్ నవజాత తల్లిగా పని, జీవిత సమతుల్యత గురించి చెప్పే ప్రయత్నమే కానీ ఈ సమయంలో మందు తాగడం బిడ్డ ఆరోగ్యంపై ఎఫెక్ట్ పడుతుందని, ఇలా చేసేందుకు బుద్ధి ఉండాలని కామెంట్స్ వస్తున్నాయి. కానీ ఇలా ఆల్కహాల్ తీసుకోవడం బేబీ హెల్త్‌ను ప్రభావితం చేస్తుందా?
శిశువుపై ప్రభావం
బ్రెస్ట్ ఫీడ్ చేస్తున్నప్పుడు తల్లి మద్యం తాగడం వల్ల కలిగే ప్రధాన సమస్యలలో ఒకటి శిశువుపై దాని ప్రభావం. ముఖ్యంగా మూడు నెలల కంటే తక్కువ వయస్సు ఉన్న బేబీస్‌లో లివర్ డెవలప్‌మెంట్ అంతగా ఉండదు. కాబట్టి ఆల్కహాల్‌ను ప్రాసెస్ చేయలేకపోతుంది. పెద్దవారి కంటే సగం రేటుతో ఆల్కహాల్‌ను జీవక్రియ చేస్తుంది. అంటే తల్లి మద్యం తాగితే.. అది బేబీ ఎదుగుదల, నిద్రా విధానాలను ప్రభావితం చేస్తుంది. మగత, బలహీనత, చిరాకుకు దారితీస్తుంది. క్రమం తప్పకుండా మద్యం సేవించడం వల్ల శిశువు పెరుగుదల, భావోద్వేగ ఆరోగ్యంలో దీర్ఘకాలిక సమస్యలు తలెత్తుతాయి.
తల్లిపై ఎఫెక్ట్
శిశువు ఆరోగ్యం ప్రధాన సమస్య అయినప్పటికీ.. బ్రెస్ట్ ఫీడ్ చేస్తున్నప్పుడు మద్యం సేవిస్తే తల్లులు కూడా పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుంది. డీహైడ్రేషన్, అలసట, నిద్ర లేకపోవడం, పాల ఉత్పత్తి తగ్గడం, కోఆర్డినేషన్ తగ్గి మానసిక స్థితిలో మార్పులు చోటు చేసుకోవడం, ఆందోళన, ఒత్తిడి, పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ కలుగుతుంది. న్యూ మదర్‌కు ఇప్పటికే ఉన్న రెస్పాన్సిబిలిటీస్‌కు తోడు ఈ శారీరక, మానసిక ఆరోగ్య సమస్యలు వచ్చి పడుతాయి. సొంత ఆరోగ్యం కోల్పోవడంతోపాటు బిడ్డను చూసుకునే సామర్థ్యం తగ్గుతుంది.
తల్లిపాలు ఇస్తున్నప్పుడు కొంత మద్యం తాగవచ్చా?
పాలిచ్చే తల్లులు మద్యం సేవించడాన్ని తగ్గించాలని అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ (AAP) సిఫార్సు చేస్తోంది. ఒకవేళ తాగాలనుకుంటే.. అప్పుడప్పుడు మితంగా ఉండాలని సూచిస్తున్నారు. ఉదాహరణకు 130 పౌండ్ల బరువున్న స్త్రీకి 8 ఔన్సుల వైన్, 2 ఔన్సుల మద్యం లేదా రెండు బీర్లు. ఇక మద్యం సేవించిన తర్వాత బిడ్డకు పాలిచ్చేందుకు కనీసం రెండు గంటలు వేచి ఉండటం మంచిది. ఇది తల్లి రక్తప్రవాహం నుంచి ఆల్కహాల్ వెళ్ళడానికి తగిన సమయం. కాగా అప్పుడు శిశువుకు పాలు ఇచ్చినా ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు.