కాలి గోళ్లలో చీము పేరుకుపోయిందా.. ఈ కలర్‌లోకి మారితే ప్రమాదమా?నివారణ ఏంటి?

by Anjali |
కాలి గోళ్లలో చీము పేరుకుపోయిందా.. ఈ కలర్‌లోకి మారితే ప్రమాదమా?నివారణ ఏంటి?
X

దిశ, వెబ్‌డెస్క్: వానాకాలంలో ఎక్కువ మంది పాదాల సమస్యతో బాధపడుతుంటారు. నిల్వ నీరులో నడవడం వల్ల కాలి గోర్ల మధ్యలోకి బ్యాక్టీరియా, ఫంగర్ వంటివి వెళ్తాయి. దీంతో కాలి గోర్లు ఇన్ఫెక్షన్ బారిన పడతాయి. ఈ కారణంచేతనే కొన్నిసార్లు గోర్లు ఎల్లో కలర్ లోకి కూడా మారుతాయి. అలాగే గోళ్ల మూలాలు బ్లాక్ గా మారతాయి. దీంతో నెయిల్స్ లో చీము తయారవుతుంది. కాగా ఈ సమస్యకు పరిష్కారాన్ని చూపిన నిపుణులు చెప్పిన వివరాలను ఇప్పుడు చూద్దాం..

సున్నితమైన స్కిన్ వారు గుర్తుంచుకోవాల్సి విషయాలు..

ఫస్ట్ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే..? కాళ్లకు చెప్పులు లేకుండా నడవకూడదు. ముఖ్యంగా అపరిశుభ్రమైన ప్రదేశాల్లో నడవొద్దు. ప్రతి రోజూ కాళ్ల నెయిల్స్ క్లీన్‌గా శుభ్రం చేసుకోండి. సున్నితమైన స్కిన్ వారు వేరే వాళ్లు యూజ్ చేసిన టవల్స్, నెయిల్ క్లిప్పర్ను వాడకూడదు.

ఇన్ఫెక్షన్ నివారణ..

అయితే ఈ కాలి గోర్ల సమస్యతో బాధపడేవారు వ్యాధి సోకిన ప్లేస్ లో టీ ట్రీ నూనె రాయండి. చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఈ ఆయిల్ అప్లై చేసిన వెంటనే షూస్ లేదా సాక్స్ వేసుకోవద్దని నిపుణలు సూచిస్తున్నారు. అలాగే ఒక స్పూన్ టీ ట్రీ నూనెను చెంచా విటమిన్ ఇ ఆయిల్‌ను మిక్స్ కలిపి కాటన్ బాల్‌తో ఇన్ఫెక్షన్ అయిన ప్రదేశంలో రాస్తే మంటను, ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది.

గమనిక: పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. కేవలం మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించగలరు.

Advertisement

Next Story