- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పాలు ఇస్తున్న చీమలు.. తొలిసారి గుర్తించిన శాస్త్రవేత్తలు
దిశ, ఫీచర్స్ : చీమలు పాలను స్రవిస్తాయని తొలిసారి గుర్తించారు పరిశోధకులు. ఈ పోషక ద్రవం మిగిలిన చీమలకు ఆహారంగా మారడంతో పాటు సామాజిక నిర్మాణాల పరిణామంలో కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ఇమ్మెచ్యూర్ స్టేజ్(ప్యూప)లో ఉన్న చీమలు ఈ ద్రవాన్ని ఉత్పత్తి చేస్తాయని నేచర్ జర్నల్‌లో ప్రచురించబడిన అధ్యయనం పేర్కొంది.
కొత్తగా పొదిగిన లార్వా పెరగడానికి, జీవించడానికి ఈ ద్రవంపై ఆధారపడి ఉంటుంది. క్షీరద శిశువులు పాలపై ఎలా ఆధారపడి ఉంటాయో.. అడల్ట్ చీమలు, లార్వా ఈ ద్రవంపై ఆధారపడుతాయి. ఒకవేళ అవి ఈ ద్రవాన్ని తీసుకోకపోతే.. అది ప్యూపపై పేరుకుపోయి, శిలీంధ్రాలతో కలుషితమై చంపుతుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ క్రమంలోనే చీమల జీవిత చక్రంలోని వివిధ దశలను.. ఒంటరిగా ఉంచబడిన క్లోనల్ రైడర్ చీమలను గమనించడం ద్వారా కనుగొన్నారు. చీమల కాలనీలు అంతగా ఏకీకృతం కావడానికి కారణమేమిటో పరిశోధించారు. ఐసోలేట్ చేయబడిన చీమల ప్యూపను గమనిస్తున్నప్పుడు.. పొత్తికడుపుపై ద్రవం చుక్కలు కనిపించడం చూసి ఆశ్చర్యపోయిన శాస్త్రవేత్తలు.. ఈ ద్రవం ఏర్పడినప్పుడు ప్యూప దానిలో మునిగిపోయిందని, తొలగించినప్పుడు బయటపడిందని వివరించారు.
ప్యూపలోకి బ్లూ ఫుడ్ డైని ఇంజెక్ట్ చేయడం ద్వారా అది ఎక్కడ ముగిసిందో గుర్తించారు. ప్యూప ద్రవాన్ని స్రవించినప్పుడు.. వయోజన చీమలు తాగుతాయని, లార్వాలను అక్కడకు తీసుకువెళ్లడం ద్వారా అవి త్రాగడానికి సహాయపడతాయని తెలిపారు. ఇది ద్రవం పేరుకుపోవడాన్ని ఆపివేస్తుంది. అంటే అడల్ట్ యాంట్స్.. ప్యూపను శుభ్రపరచడం, లార్వాలను తీసుకొని వాటిని ఆహారం కోసం ప్యూపపై ఉంచడం వంటి క్రియల ద్వారా తల్లిదండ్రుల సంరక్షణ బాధ్యతలను నెరవేరుస్తున్నాయని వివరించారు.
ఇక ఈ ద్రవం మాలిక్యులర్ కంపోజిషన్‌ను పరీక్షించిన బృందం.. ప్రత్యేకమైన 185 ప్రోటీన్‌లను, అలాగే అమైనో ఆమ్లాలు, చక్కెరలు, విటమిన్లు వంటి 100 కంటే ఎక్కువ జీవక్రియలను గుర్తించింది. ఈ ద్రవం.. మౌల్టింగ్ ద్రవాల నుంచి ఉద్భవించిందని.. లార్వా ప్యూపగా అభివృద్ధి చెందుతున్నప్పుడు వాటి బయటి క్యూటికల్‌ను తొలగించినప్పుడు ఇది ఉత్పత్తి అవుతుందని తెలిపారు. ఇది కాలనీ లోపల చీమలు చేస్తున్న ఆపర్చునిటిక్ రీసైక్లింగ్, శ్రమ యొక్క జీవక్రియ విభజన' అని శాస్త్రవేత్తలు చెప్పారు.
Also Read....