- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
లంచ్ ప్లేట్ కోసం ప్రిన్సిపల్, టీచర్ల ఫైటింగ్.. ! (వీడియో)
దిశ, వెబ్‌డెస్క్ః లేనోడు లేక చస్తుంటే.. ఉన్నోడు తినలేక చస్తన్నాడనే సామెత అందరికీ తెలుసు, అయితే మరో రకం జనాలు కూడా ఉంటారు. ఎంతున్నా ఫ్రీగా వస్తే ఫినాయిల్ కూడా తాగుతారనే నయా సామెతలో సబ్జెక్ట్‌లు వీళ్లు. సరిగ్గా, ఇలాంటి వారే పంజాబ్ ప్రభుత్వం ఇచ్చిన విందులో ప్రత్యక్షమయ్యారు. మంచి బుద్దులు చెప్పి, రేపటి పౌరుల్ని తయారుచేయాల్సిన టీచర్లు పరువు మర్యాదులు కూడా మరచి, ఫ్రీ ఫుడ్ కోసం ఫైటింగ్ మొదలుపెట్టారు. ఇటీవల, పంజాబ్‌లో అధికారం సొంతం చేసుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)కి చెందిన ముఖ్యమంత్రి భగవంత్ మాన్ అధ్యక్షతన విద్యావ్యవస్థపై అభిప్రాయ సేకరణ కోసం రాష్ట్రవ్యాప్తంగా 2,600 మంది పాఠశాలల అధిపతులు, జిల్లా విద్యాశాఖాధికారులతో విద్యాశాఖ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సమావేశం ముగిసిన తర్వాత లూథియానాలోని ఒక ఖరీదైన రిసార్ట్‌లో ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు ఉచితంగా భోజన ఏర్పాట్లు కూడా చేశారు. ఇక్కడే ఈ విడ్డూరం చోటుచేసుకుంది.
మీటింగ్‌లో కూర్చొని ఆకలేసిందో, లేక సీఎం ఇచ్చే కాస్ట్లీ ఫుడ్ ఫ్రీగా వస్తుందని అనుకున్నారేమో గానీ, ప్లేట్‌ల కోసం తల్లడిల్లుతూ, మోచేతులతో తోసుకుంటూ, కొట్టుకుంటూ, గందరగోళంగా రచ్చ రచ్చ చేశారు. ఈ దృశ్యాలను వీడియో తీసిన అక్కడి సిబ్బంది అది కాస్తా సోషల్ మీడియాకు ఎక్కించారు. "అవుట్-ఆఫ్-ది-బాక్స్" విద్యా సంస్కరణలను తీసుకురావడానికి సూచనలను కోరేందుకు ముఖ్యమంత్రి ఆన్‌లైన్ పోర్టల్‌ను ప్రారంభించిన ఈ సమావేశంలో, 'అవుట్-ఆఫ్-ది-కంట్రోల్ ' అయిన ఉపాధ్యాయుల వికృత ప్రవర్తనను ప్రజలు, నెటిజన్లు తీవ్రంగా విమర్శించారు.