- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ప్లాన్ చేయండి, ఆచరణలో పెట్టండి.. ఆరోగ్యం, ఆనందం మీ సొంతం అవుతాయి !
దిశ, ఫీచర్స్ : మీరు తీసుకునే చిన్న చిన్న నిర్ణయాలు, రోజువారీ పనులు కూడా హెల్తీ లైఫ్ స్టైల్‌కు దోహదం చేస్తాయంటున్నారు నిపుణులు. ఎవరి జీవితంలోనూ మెరుగైన మార్పులు సడెన్‌గా జరగవు. ప్రయత్నాన్ని బట్టి మాత్రమే అనేక అంశాలు ముడిపడి ఉంటాయి. ఆనందం, ఆరోగ్యం విషయాల్లోనూ సరిగ్గా ఇదే వర్తిస్తుంది. అందుకే మీరు కోరుకున్నది సాధించాలంటే.. ముందుగా ప్లాన్ అందుకు తగిన ప్లాన్ చేయండి. ఆ తర్వాత అనుసరించండి అంటున్నారు మానసిక నిపుణులు. ఉదాహరణకు మీరు రోజూ త్వరగా లేవాలని ఒకమాట అనుకుంటే సరిపోదు. డైలీ మార్నింగ్ ఫలానా టైమ్‌కే నిద్రలేచి వ్యాయామం చేయాలి అని ప్లాన్ చేసుకుని మనసులో పదే పదే అనుకోండి. అవసరం అయితే ఒక కాగితం మీద పదిసార్లు రాయండి. దీనివల్ల ఆచరణకు అవసరమైన ఆలోచనలు మీ మైండ్‌లో ముద్రపడిపోతాయి. పాజిటివ్ దిశగా మీ మైండ్ సెట్ మారుతుంది.
ఏది సాధించాలన్నా ముందుగా తగిన ప్లాన్ చేసుకోవడం, లక్ష్యం పెట్టుకోవడం, సానుకూల దృక్పథం కలిగి ఉండటం తప్పక చేయాలి. అప్పుడే హెల్తీ అండ్ హ్యాపీనెస్ లైఫ్‌స్టైల్ మీ సొంతం అవుతుంది. కొన్ని పెద్ద పెద్ద లక్ష్యాల నెరవేరాలంటే తగిన వనరులు, ఆర్థిక అంశాలతో ముడిపడి ఉంటాయేమో కానీ, మీ ఆరోగ్యానికి, ఆనందానికి సంబంధించిన గోల్స్ సాధించాలంటే అలాంటివేం అక్కర్లేదు. రోజూ 15 నిమిషాలు వాకింగ్ లేదా రన్నింగ్ చేయాలని టార్గెట్ పెట్టుకొని ఆచరించండి. దీంతో మీలో ఆందోళన దూరం అవుతుంది. చురుకుదనం పెరుగుతుంది. మనసు తేలికపడుతుంది. ఏదో తెలియని మధురాను భూతిని అనుభవిస్తారు. ఒక్క చిన్న ప్లాన్ ఆచరణలో పెట్టడం ఎంత మార్పు తెస్తుందో మీకే అర్థం అవుతుంది. చాలామంది పనిలో పడి లేదా సరైన అవగాహన లేక తగిన మోతాదులో నీళ్లు తాగడం మర్చిపోతుంటారు. కానీ తర్వాత ఆరోగ్యంపై నెగెటివ్ ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది. ఇలాంటి జరగవద్దంటే నీళ్లు తాగడం కూడా ఒక లక్ష్యంగా పెట్టుకోండి. ప్రతిరోజు ఏ టైమ్‌లో ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో ప్లాన్ చేసుకొని ఆచరణలో పెట్టండి. కొన్నాళ్ల తర్వాత మీ మైండ్‌సెట్ అందుకు అనుగుణంగా మారిపోతుంది. అప్పుడు ఎవరూ చెప్పకపోయినా మీరు నీళ్లు తాగడం అస్సలు మర్చిపోరు. వ్యాయామం, నీళ్లు మాత్రమే కాదు, సరైన ఆహారం, నిద్ర, చదువు, ప్రొఫెషనల్ వర్క్, పర్సనల్ హాబిట్స్ వంటి అనేక అంశాల్లోనూ ప్లాన్ చేయడం, టార్గెట్ పెట్టుకోవడం, ఆచరించడం చేస్తూపోతే ఆరోగ్యం, ఆనందం మీ సొంతం అవుతాయని నిపుణులు చెప్తున్నారు.
Read More: Raksha Bandhan : ఈ సారి రెండు రోజులు రాఖీ పండుగ.. ఏ రోజు రాఖీ కట్టడం మంచిదంటే?