అన్నం తిన్న ప్లేట్‌లోనే చేయి కడుగుతున్నారా.. ఎంత అరిష్టమంటే?

by samatah |
అన్నం తిన్న ప్లేట్‌లోనే చేయి కడుగుతున్నారా.. ఎంత అరిష్టమంటే?
X

దిశ, వెబ్‌డెస్క్ : అన్నం పరబ్రహ్మస్వరూపం అంటారు. అందుకే అన్నం తినేసమయంలో ఎలాంటి తప్పులు చేయకూడదు అంటారు పెద్దవారు. కానీ చాలా మంది తమకు తెలియకుండానే ఎన్నో తప్పులు చేస్తారు. అందులో ఒకటి ప్లేలట్‌లో అన్నం తిని అందులోనే చచేతులు కడగడం. అయితే అలా చేయడం చాలా తప్పంట. తిన్న ప్లేట్‌లోనే చేతులు కడగడం వలన అరిష్టం పట్టుకుంటుందంట. అంతే కాకుండా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందంట. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం.

భోజనం చేసే సమయంలో మన ధ్యాసంతా తిండి మీదే ఉండాలంట అనవసర విషయాల గురించి ఆలోచించకూడదంట. అలాగే కొంత మంది అన్నం స్పూన్‌తో తిన్నా సరే, ప్లేట్‌లోనే చేయికడుగుతారు. అయితే ఇలా చేయడం మంచిది కాదంట. ఇలా చేస్తే.. అన్న‌పూర్ణా దేవితోపాటు ల‌క్ష్మీదేవికి కూడా కోపం వ‌స్తుంద‌ట‌. ఎందుకంటే మ‌నం తినే ఆహారం ఎంతో ప‌విత్ర‌మైంది. అలాంటి ఆహారాన్ని తిన్న ప్లేట్‌లోనే చేతుల‌ను క‌డ‌గడం అంటే పాపం చేసిన‌ట్లే. భోజ‌నం చేశాక ఎట్టి ప‌రిస్థితిలోనూ ప్లేట్‌లో చేతుల‌ను క‌డ‌గ‌రాదు.అలాగే భోజనం ఉన్న ప్లేట్‌ను కేవ‌లం ఒకే చేత్తో ప‌ట్టుకోకూడదంట. ఇలా చేస్తే ఇంట్లో డబ్బు నిలవదంట.

Advertisement

Next Story