మీ పిల్లలు అతిగా టీ,కాఫీ తాగుతున్నారా..డేంజర్‌లో పడ్డట్లే!

by Jakkula Samataha |
మీ పిల్లలు అతిగా టీ,కాఫీ తాగుతున్నారా..డేంజర్‌లో పడ్డట్లే!
X

దిశ, ఫీచర్స్ : ఉదయం లేవగానే అందరికీ గుర్తు వచ్చేది టీ. తెల్లవారుజాము కాగానే, చాలా మంది టీ తాగడానికి ఇష్టపడుతారు. ఇక కొంత మందికి టీ తాగనిదే ఆ రోజే గడవనట్లు అనిపిస్తుంది. ఇక టీ ఆరోగ్యానికి మంచిదే అయినా అతిగా తాగడం ఆరోగ్యానికి హానికరం అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

అయితే కొంత మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు అతిగా టీ తాగడం అలవాటు చేస్తుంటారు. ఉదయం గ్లాస్ టీ, అలాగే మధ్యలో కూడా టీ లేదా కాఫీ బిస్కెట్స్ ఇస్తూ పిల్లలను అనారోగ్యం బారిన పడేలా చేస్తుంటారు. వైద్యుల ప్రకారం,14 సంవత్సరాలకంటే తక్కువ వయసున్న పిల్లలకు టీ లేదా కాఫీ ఇవ్వడం వలన ఇది వారి పెరుగుదలపై తీవ్ర ప్రభావం చూపుతుందంట. అలాగే టీ అనేది పిల్లల దంతాలు, ఎముకలను బలహీనపరుస్తాయి. అంతే కాకుండా టీ, కాఫీలో ఉండే కెఫిన్ మెదడును ఉత్తేజపరుస్తుంది. హృదయ స్పందన రేటును పెంచుతుంది. అదనంగా, కాఫీ తీసుకోవడం కూడా పిల్లల నిద్రకు భంగం కలిగిస్తుంది. ఫలితంగా, దాని ప్రభావంతో పిల్లల ఎదుగుదల కూడా దెబ్బతింటుంది. అందువలన తల్లిదండ్రులు పిల్లలకు టీ, కాఫీ‌లు అస్సలే అలవాటు చేయకూడదు అంటున్నారు వైద్యులు.

Advertisement

Next Story

Most Viewed