- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టూత్ బ్రష్‌తో జైలు గోడలకు కన్నం వేసి పారిపోయిన ఖైదీలు.. మళ్లీ పోలీసులకు ఎలా దొరికారంటే?
దిశ, వెబ్‌డెస్క్: సాధారణంగా జైళ్లో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు పారిపోవడానికి నానా రకాలుగా ప్రయత్నిస్తుంటారు. ఈ ప్రయత్నంలో కొందరు సక్సెస్ కాగా, మరికొందరు విఫలం అవుతుంటారు. ఇటీవల కొందరు చేసిన ప్రయత్నం సక్సెస్ అయినా.. తీరా బయటకు వచ్చాక దొరికిపోయారు. ఈ ఘటన అమెరికాలోని వర్జీనియాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. జాన్ ఎం గార్జా(37), ఆర్లివీ నీమోలు(43) అనే ఇద్దరు జైల్లో ఖైదీలుగా శిక్ష అనుభవిస్తున్నారు. కోర్టు ధిక్కరణ, నిబంధనల ఉల్లంఘనలు, కోర్టులో హాజరుకాకపోవడం వంటి నేరాలతో గార్జాకు జైలు శిక్ష పడింది. ఫోర్జరీ, క్రెడిట్ కార్డ్ ఫ్రాడ్, నిబంధనల ఉల్లంఘన వంటి నేరాలతో నీమో అరెస్టు అయ్యాడు. వీరిద్దరూ జైలు నుంచి తప్పించుకోవడానికి వినూత్నంగా ఆలోచించారు.
టూత్ బ్రష్, ఒక మెటల్ పరికరం ఉపయోగించి పెద్ద గోడను బద్ధలు కొట్టి, చీకటిపడ్డ తర్వాత బయటకు కొన్నిమీటర్ల దూరం పారిపోయారు. ఆ విషయం అటెండెన్స్ తీసుకునే సమయంలో జైలు అధికారులకు తెలిసింది. దీంతో వారు ఉండే జైలు గదిని పరిశీలించగా ఆ గదికి కన్నం పెట్టి పారిపోయారని అధికారులు గుర్తించి వెంటనే అలర్ట్ అయ్యారు. మరుసటిరోజు తెల్లవాజామున జాన్, ఆర్లివీ కేక్ తినడానికి ఐహోప్ అనే రెస్టారెంట్‌కి వెళ్లారు. వీరు అనుమానంగా కనిపిస్తున్న తీరును గమనించిన రెస్టారెంట్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఆ ఖైదీలను మళ్లీ జైలుకి తరలించారు. అయ్యో వారు ఆ ప్యాన్ కేక్ అయినా తిన్నారా? లేదా? అంటూ నెటిజన్లు వారిపై సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.