- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Pregnancy: ఈ వయస్సులో గర్భాధారణ సేఫ్ కాదు!
దిశ, ఫీచర్స్: ప్రపంచవ్యాప్తంగా చాలామంది మహిళలు పిల్లల్ని కనే విషయంలో ఆలస్యం చేస్తున్నారు. విద్య, కేరీర్‌పై శ్రద్ధ చూపిస్తూ.. అన్నీ విధాలుగా స్థిరపడిన తరువాతే వివాహం, పిల్లల్ని ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే వారి వయస్సు పెరుగుతోంది. సాధారణంగా కొంత వయస్సు దాటిన స్త్రీలు బిడ్డను కనడంలో ఎన్నో రకాల సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. మరికొందరికి ఆరోగ్యపరమైన సమస్యల కారణంగా ప్రెగ్నెన్సీ ఆలస్యం అవుతుంది. ఇలా కారణాలు ఏవైనా ఆలస్యంగా గర్భం ధరించడం వల్ల స్త్రీల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు.
* 35-40 ఏళ్ల తర్వాత గర్భధారణతో డెలివరీ సమయంలో ఆరోగ్య సమస్యలు దారి తీస్తుంది. అంతేకాకుండా 35 ఏళ్ల తర్వాత మహిళల్లో సంతానానికి దోహదం చేసే అండాల పరిమాణం, నాణ్యత తగ్గుతుంది. దీనికి తోడు జన్యుపరమైన లోపాలు తలెత్తుతాయి. ఈ వయస్సు దాటాక వచ్చే ప్రెగ్నెసీ తల్లి, బిడ్డ ఇద్దరికి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. మహిళల వయస్సు పెరిగే కొద్దీ ఎండో మెట్రియోసిస్, యుటెరైన్ ఫైబ్రాయిడ్స్ సమస్యలు పెరుగుతాయి. కాబట్టి లేట్ ప్రెగ్నెన్సీ సేఫ్ కాదు.
* దాదాపుగా 30 శాతం మంది మహిళలలో ఈ సైడ్ ఎఫెక్ట్ తక్కువగా ఉంటుంది. కానీ, 70 శాతం మంది స్త్రీలలో ప్రెగ్నెసీ టైమ్‌లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇది శరీరంలోని ఇతర వ్యవస్థలపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.
* గర్భధారణ సమయంలో చాలా మంది మహిళలకు డయాబెటిస్ వచ్చి, డెలివరీ తర్వాత తగ్గిపోతూ ఉంటుంది. ఈ పరిస్థితిని గెస్టేషనల్ డయాబెటిస్ అంటారు. అయితే 40 ఏళ్లు దాటిన వారిలోనే ఈ సమస్యలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. ప్రీ ఎక్లాంప్సియా, గెస్టేషనల్ డయాబెటిస్, గెస్టేషనల్ హైపర్ టెన్షన్ లేట్ వయస్సు ప్రెగ్నెన్సీలో వస్తే అలాగే కొనసాగే అవకాశం ఉంటుంది.
* తల్లి వయస్సు పెరిగే కొద్ది క్రోమోజోమ్ సమస్యల ప్రమాదం కూడా పెరుగుతుంది. అంతేకాకుండా అధిక రక్తపోటు వల్ల ఫిట్స్ రావడం, బ్రెయిన్‌లోని రక్తనాళాలు చిట్లడం వంటి ప్రమాదాలు జరగవచ్చు.
* లేటుగా గర్భం ధరించిన మహిళలకు నార్మల్ డెలివరీలు కాకపోవడం, లేకపోతే గర్భం నిలిచిన రెండు మూడు నెలలకు అబార్షన్ అవ్వడం, నెలలు నిండకుండానే డెలివరీ కావడం వంటివి జరుగుతుంటాయి. కాబట్టి 40 ఏళ్ల తర్వాత గర్భధారణ అంత సురక్షితం కాదంటున్నారు వైద్య నిపుణులు.
* పలు ఆరోగ్య నివేదికల ప్రకారం.. లేటు వయస్సు ప్రెగ్నెన్సీ కారణంగా ఫీటల్ మాక్రోసోమియా ప్రాబ్లం పెరుగుతుంది. అంటే పుట్టబోయే పిల్లలు చాలా తక్కువ బరువుతో కానీ లేదా అధిక బరువుతో కానీ పుట్టే అవకాశం ఉంటుంది. అందుకే దంపతులు 35 ఏళ్లలోపే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోడం మంచిదని నిపుణులు సూచిస్తుంటారు. ఇక తప్పని పరిస్థితుల్లో 40 ఏండ్లు ఆ తర్వాత ప్రెగ్నెంట్ అయితే వైద్య నిపుణుల సూచనలు తప్పక పాటించాలి. సేఫ్ డెలివరీకోసం అవసరమైన లైఫ్ స్టైల్‌ను అలవర్చుకోవడం మంచిది.
*గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. అనుమానాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించగలరు.