- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హోలీ వచ్చేస్తుంది.. మహిళలు ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాల్సిందే!
దిశ, వెబ్‌డెస్క్ : హోలీ రంగుల పండుగ అంటే ఇష్టపడని వారు ఎవరూ ఉండరు. ఎప్పుడెప్పుడు హోలీ పండుగ వస్తుందా.. మన స్నేహితులపై రంగులు ఎప్పుడు చల్లుదామా అని ఆశగా ఎదురు చూస్తుంటారు. కానీ రంగులను సహజమైనవి వాడాలి, కెమికల్ కలర్స్ వాడటం వలన సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అంతే కాకుండా హోలీని ఎంజాయ్ చేయడానికి కొంత మంది మహిళలు స్నేహితులతో కలిసి ఇతర ప్రదేశాలకు వెళ్తుంటారు. ఈ క్రమంలో వారు భద్రతతో రాజీ పడుతారు. దీంతో పండుగ రోజు మీ మూడ్ మొత్తం పాడవుతుంది. అయితే అలాంటి సమస్యలు తలెత్తకుండా, ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి, మహిళలు కొన్ని విషయాల్లో ఎలా వ్యవహరించాలి అనే విషయాలను తెలుసుకుందాం.
1. చాలా మంది యువతులు తన స్నేహితులతో కలసి బయట ప్రదేశాలకు వెళ్లి హోలీని ఏంజాయ్ చేస్తుంటారు. అయితే మహిళలు ఎవరితో, ఎక్కడికి వెళ్తున్నారో, ముందుగా కుటుంబ సభ్యులకు తెలియజేయాలి. మీరు హోలీ ఆడుతున్న సమయంలో మీ ఫొన్‌ను సరైన ప్లేస్‌లో పెట్టుకోవాలి. రంగులు పడి ఫొన్ పాడవకుండా ఉంటుంది. ఏదైనా సమస్య వచ్చినా, త్వరగా ఫొన్ ద్వారా మన కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వవచ్చు.
2. మహిళలు తమ స్నేహితులతో కలసి దూర ప్రదేశాలకు హోలీ రోజు వెళ్లకూడదు. దీని వలన సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది.
3. హోలీ రోజు స్నేహితులు ఇచ్చిన ఏదైనా ఫుడ్ తీసుకునే సమయంలో జాగ్రత్త వహించాలి. లేకపోతే మత్తుమందు కలిపే అవకాశాలు ఉంటాయి.
4. ఎక్కువగా బాగా తెలిసిన వారితోనే హోలీ రోజు దూర ప్రదేశాలకు వెళ్లాలి.
5. మహిళలు హోలీ రోజు బయటకు వెల్లే ముందు, కనీస జాగ్రత్తలు పాటించాలి. తమ వెంట పెప్పర్ స్ప్రే లాంటివి తీసుకెళ్లడం మంచిది.