తగినంత నీరు తీసుకోకపోతే చిన్నవయసులోనే చనిపోయే ప్రమాదం..సరికొత్త అధ్యయనం

by Prasanna |   ( Updated:2023-01-03 08:40:07.0  )
తగినంత నీరు తీసుకోకపోతే చిన్నవయసులోనే చనిపోయే ప్రమాదం..సరికొత్త అధ్యయనం
X

దిశ, ఫీచర్స్: శరీరానికి సరిపోయేంత నీటిని తీసుకోకపోతే అనారోగ్యాలు తప్పవని తెలిసిందే. అందుకే రోజుకూ కనీసం నాలుగు లీటర్ల నీరు తాగాలని సూచిస్తుంటారు వైద్యులు. అయితే డీహైడ్రేషన్ కారణంగా అనారోగ్యం మాత్రమే కాదు చిన్న వయసులోనే చనిపోయే ప్రమాదముందని హెచ్చరిస్తోంది నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ సరికొత్త అధ్యయనం. పేలవమైన హైడ్రేషన్ వేగంగా వృద్ధాప్యానికి దారితీస్తుందని, దీర్ఘకాలిక వ్యాధులకు కారణమవుతుందని పేర్కొంది. మిడిల్ ఏజ్ హై నార్మల్ సీరం సోడియం..వేగవంతమైన జీవసంబంధమైన వృద్ధాప్యం, దీర్ఘకాలిక వ్యాధులు, అకాల మరణాలకు ప్రమాద కారకంగా ఉందని eBioMedicine జర్నల్‌లో ప్రచురించబడింది.

ఇక ఈ అధ్యయనాన్ని నిర్వహించడానికి, పరిశోధకులు సుదీర్ఘ 25 సంవత్సరాల ఫాలో-అప్‌తో లార్జ్ పాపులేషన్ బేస్డ్ అబ్జర్వేషనల్ స్టడీ నిర్వహించారు. అథెరోస్‌క్లేరోసిస్ రిస్క్‌పై కమ్యూనిటీస్ అధ్యయనం సేకరించిన మధ్యవయస్కుల డేటాను ఇందుకోసం వినియోగించారు. కాగా హైడ్రేషన్ హ్యాబిట్స్‌కు ప్రాక్సీగా సీరం సోడియంను ఉపయోగించినట్లు పరిశోధకులు తెలిపారు.

వృద్ధాప్యం సాపేక్ష వేగాన్ని అంచనా వేయడానికి.. ఈ వయస్సు-ఆధారిత బయోమార్కర్ల నుంచి జీవసంబంధమైన వయసును లెక్కించారు పరిశోధకులు. ఫలితాలను విశ్లేషించిన తర్వాత..దీర్ఘకాలిక వ్యాధులు, అకాల మరణాల ప్రమాదాలను అంచనా వేశారు. మధ్య వయస్కుడిలో సీరం సోడియం 142 mmol/l కంటే ఎక్కువ ఉంటే దీర్ఘకాలిక వ్యాధులను అభివృద్ధి చేసే ప్రమాదాన్ని 39 శాతం పెంచుతుందని, 144 mmol/l కంటే ఎక్కువ ఉంటే అకాల మరణాల ప్రమాదం 21 శాతం పెరుగుతుందని విశ్లేషణలో పేర్కొంది.

Also Read...

ఈ సీజన్‌లో పిల్లలకు అరటిపండు తినిపిస్తే ఏమవుతుందో తెలుసా?

Advertisement

Next Story

Most Viewed