ఇకపై గాయాలకు డ్రెసింగ్ అక్కర్లేదు.. 'SmartHEAL' డివైజ్‌తో పరిష్కారం

by samatah |   ( Updated:2022-11-30 13:59:25.0  )
ఇకపై గాయాలకు డ్రెసింగ్ అక్కర్లేదు.. SmartHEAL డివైజ్‌తో పరిష్కారం
X

దిశ, ఫీచర్స్: గాయాన్ని నయం చేయడంలో జరిగే సాధారణ తప్పు ఏంటో తెలుసా? తరచుగా డ్రెసింగ్‌ను మార్చడమే. ఇది గాయం త్వరగా మానకుండా చేయడమే కాదు కొన్ని పరిస్థితుల్లో తీవ్రమైన అనారోగ్యం లేదా మరణానికి దారితీస్తుంది. అందుకే దీర్ఘకాలిక గాయాలకు డ్రెసింగ్ అవసరం లేకుండానే హీల్ అయ్యే పరికరాన్ని రూపొందించారు పోలాండ్‌కు చెందిన విద్యార్థులు. తమ బ్రెయిన్ చైల్డ్ 'SmartHEAL' ఆవిష్కరణతో.. ప్రెస్టీజియస్ 'జేమ్స్ డైసన్ అవార్డు' గెలుపొందారు.

'SmartHEAL' డివైజ్ అనేది దీర్ఘకాలిక గాయాల పరిస్థితిని పర్యవేక్షించే డ్రెస్సింగ్. ఇది కణజాలాన్ని తొలగించకుండా, ఎలాంటి అంతరాయం కలిగించకుండా హీలింగ్ ప్రాసెస్‌ను తెలపగలదు. సాధారణంగా బ్యాండ్-ఎయిడ్ డ్రెస్సింగ్ తీసిన ప్రతిసారీ.. కొత్త వ్యాధికారకాల ప్రవేశానికి అవకాశమిచ్చినట్లు అవుతుంది. తద్వారా ఇన్ఫెక్షన్లకు గురయ్యే ప్రమాదం ఉంది. కణజాలానికి కూడా అంతరాయం కలుగుతుంది. వైద్య ప్రక్రియ మందగిస్తుంది. ముఖ్యంగా రోగులకు చాలా అసౌకర్యంగా ఉంటుంది. ఈ బాధను గుర్తించిన తాము ఈ ఆవిష్కరణతో వచ్చినట్లు తెలిపారు వార్సా యూనివర్శిటీ ఆఫ్ టెక్నాలజీకి చెందిన ముగ్గురు PhD విద్యార్థులు. 'SmartHEAL' డ్రెస్సింగ్ తీయకుండానే .. గాయం యొక్క pH స్థాయి ఆధారంగా వూండ్ హీలింగ్ గురించి సమాచారాన్నిస్తుంది. ఈ pH సెన్సార్ డ్రెస్సింగ్‌ను మార్చాలా లేదా అని వినియోగదారుకు తెలియజేస్తుంది.

యుఎస్ నేషనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ ఇన్ఫర్మేషన్ ద్వారా గాయం యొక్క pH, ట్రీట్మెంట్ ప్రాసెస్ మధ్య లింక్ గురించి తెలుసుకున్న ఈ ముగ్గురు విద్యార్థులు.. అభివృద్ధి చెందిన దేశాలలో 2 శాతం మంది ప్రజలను ప్రభావితం చేసే సమస్యను పరిష్కరించగలరని గ్రహించారు. 'మా ఆవిష్కరణ ప్లాస్టర్‌లో అనుసంధానించబడిన pH సెన్సార్‌పై ఆధారపడి ఉంటుంది. ఈ pH సెన్సార్ దీర్ఘకాలిక గాయం యొక్క స్థితిని తనిఖీ చేయడానికి అనుమతిస్తుంది. డ్రెస్సింగ్‌ను మార్చాలా లేదా అని వినియోగదారుకు తెలియజేస్తుంది' అని తెలిపారు.

ప్రతి డ్రెస్సింగ్‌లో ఫాబ్రిక్‌పై ముద్రించిన ఎలక్ట్రానిక్ pH మానిటర్ మరియు రేడియో-ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (RFID) యాంటెన్నా ఉంటుంది. ఇది మొబైల్ ఫోన్ లేదా ట్యాబ్‌లెట్‌తో కమ్యూనికేట్ చేయగలదు. తాము నిర్మించిన వ్యవస్థను ప్రస్తుత వస్త్ర పరిశ్రమ ప్రక్రియలతో కేవలం కొన్ని సెంట్ల ఖర్చుతో భారీగా ఉత్పత్తి చేయవచ్చని బృందం చెబుతోంది. 'మా ప్రోటోటైప్‌లతో కూడా.. మేము వస్త్ర పరిశ్రమలో భారీ ఉత్పత్తికి ఉపయోగించే అదే తయారీ సాంకేతికతను ఉపయోగిస్తున్నాము' అని తెలిపారు. ఇక జేమ్స్ డైసన్ అవార్డు ద్వారా పొందిన ప్రైజ్ మనీ (రూ.29లక్షలు)ని క్లినికల్ ట్రయల్స్‌కు ఉపయోగించాలని ప్లాన్ చేస్తున్న ఈ పీహెచ్‌డీ విద్యార్థులు.. మొత్తానికి 2025లో SmartHEAL డ్రెస్సింగ్‌ల విక్రయించడం ప్రారంభించడానికి సర్టిఫికేషన్ ప్రక్రియను సకాలంలో పూర్తి చేయాలని ఆశిస్తున్నట్లు చెప్పారు.

READ MORE

బార్ కోడ్‌ టాటూ వైరల్.. ఇక పేమెంట్స్‌కు ఫోన్ అక్కర్లేదు!

Advertisement

Next Story

Most Viewed