- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
సమ్మర్ టూర్ ప్లాన్ చేస్తున్నారా? IRCTC సూపర్ ప్యాకేజీ గురించి తెలుసుకోండి!

దిశ, వెబ్‌డెస్క్: సమ్మర్ వచ్చేసింది. చాలా మంది టూర్ వెళ్లేందుకు ప్లాన్ చేస్తుంటారు. అయితే, వీరి కోసమే IRCTC అద్భుతమైన ప్యాకేజీని తీసుకొచ్చింది. అమేజింగ్ అండమాన్ పేరుతో మొత్తం 5 రాత్రులు, 6 పగళ్లు అండమాన్ దీవుల్లో ఎంజాయ్ చేసేలా ప్లాన్ చేసింది. ఇందులో భాగంగా పోర్ట్ బ్లెయిర్, హేవ్‌లాక్ ఐలాండ్, నెయిల్ ఐలాండ్‌తో పాటు అక్కడి ఫేమస్ పరిసరాలను కూడా చూసిరావచ్చు. హైదరాబాద్ నుంచి ఫ్లైట్ జర్నీ ద్వారా ఈ టూర్‌కి వెళ్లి రావాల్సి ఉంటుంది. మార్చి 12వ తేదీన అందుబాటులో ఉంటుంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
ప్యాకేజీ వివరాలు:
హైదరాబాద్ నుంచి ఉదయం 6.35 గంటలకు శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి టూర్ ప్రారంభం అవుతుంది. కంఫర్ట్‌లో సింగిల్ ఆక్యూపెన్సీ, డబుల్ ఆక్యూపెన్సీ, ట్రిపుల్ ఆక్యూపెన్సీ ఎంచుకున్న దాన్ని బట్టి ధరలు నిర్ణయించింది. 5 నుంచి 11 సంవత్సరాల చిన్నారులకు విత్ బెడ్ అయితే రూ.42,950 చెల్లించాలి. 2 నుంచి 11 సంవత్సరాల చిన్నారులకు విత్ అవుట్ బెడ్ అయితే రూ. 39,525 పే చేయాలి.
ప్యాకేజీ ధర వివరాలు :
సింగిల్ ఆక్యుపెన్సీకి రూ. 68,320, డబుల్ ఆక్యుపెన్సీకి వ్యక్తికి రూ. 51,600, ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.49,960 చెల్లించాలి. అలాగే, 5-11 సంవత్సరాల పిల్లలకు విత్ బెడ్ రూ.42,950, విత్ అవుట్ బెడ్ రూ. 39,525గా ధర ఉంది.
ప్యాకేజీలో లభించే సదుపాయాలు:
* హైదరాబాద్ నుండి పోర్ట్ బ్లెయిర్‌కు విమాన ప్రయాణ ఛార్జీలు
* 3 స్టార్ హోటల్‌లో 5 రాత్రులు బస ఉంటుంది. ఇందులో 2 రాత్రులు పోర్ట్ బ్లెయిర్‌లో 2 రాత్రులు హేవ్‌లాక్ ఐలాండ్‌లో, ఒక రాత్రి నీల్ ఐలాండ్‌లో స్టే ఉంటుంది.
* హోటల్‌లో అల్పాహారం, రాత్రి భోజనం వారే అందిస్తారు. లంచ్‌కు ప్యాకేజీలో వర్ధించదు.
* ఏసీ వాహనంలో అన్ని సందర్శనా స్థలాలు ప్రయాణ ఖర్చులతో సహా తిప్పి చూపుతారు.
* అన్ని సందర్శన స్థలాలకు ప్రవేశ రుసుములు, గైడ్ ఛార్జీలు వారివే ఉంటాయి.
* పోర్ట్ బ్లెయిర్ నుండి హేవ్‌లాక్ ద్వీపం, నీల్ ద్వీపానికి ఫెర్రీ ఖర్చులు వారివే ఉంటాయి.
ప్యాకేజీలో లేని సౌకర్యాలు:
భోజనం, స్నాక్స్, వాటర్ గేమ్స్, ఇతర వ్యక్తిగత ఖర్చులు లాండ్రీ, టిప్స్ ప్యాకేజీ ద్వారా లభించవు.