- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నక్షత్రాలను దగ్గర నుంచి చూస్తూ చల్లటి రాత్రిని గడపాలనుందా.. ఈ ప్రదేశాలను సందర్శించండి..
దిశ, ఫీచర్స్ : చాలామంది వారి స్ట్రెస్ నుంచి దూరం కావాలనుకున్నప్పుడు ప్రశాంతమైన ప్రదేశాలకు వెళ్లాలనుకుంటారు. కొంతమంది ఆలయాలకు వెళితే మరికొంతమంది ప్రకృతిని ఆస్వాధించడానికి వెలుతుంటారు. చాలామంది ఎక్కువగా ఇష్టపడేది సూర్యోదయం, సూర్యాస్తమయం. వీటిని చూడటానికి కొన్ని ప్రత్యేక ప్రదేశాలకు వెళతారు. ఆ ప్రదేశాల్లో వారు అందమైన దృశ్యాన్ని ఆస్వాదించవచ్చు. ఇక మరికొంతమంది చల్లని రాత్రి సమయంలో ఆకాశంలో మెరిసే నక్షత్రాలను చూసి ఆనందాన్ని పొందుతారు. కొత్తగా పెళ్లైన జంటలు ఇలాంటి కొన్ని ప్రత్యేకమైన ప్రదేశాల్లో హనీమూన్ ప్లాన్ చేసుకుంటారు. మీరు కూడా అలాంటి ప్రదేశాలకు వెళ్లాలనుకుంటే ఈ వివరాలను తెలుసుకోండి.
మజ్ఖలి, రాణిఖేత్..
మజ్ఖలి ఉత్తరాఖండ్‌లోని రాణిఖేత్ నుండి 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ రాత్రిపూట పూర్తిగా నక్షత్రాలతో నిండి ఉన్న అందమైన ఆకాశాన్ని చూడవచ్చు. నగరంలో ఉండే గజిబిజి జీవితానికి దూరంగా ఇక్కడ ప్రకృతిలో ఉన్న అందమైన దృశ్యాలను చూడవచ్చు. అలాగే త్రిశూల్ పర్వతం పై ఉన్న అద్భుతాలను కూడా వీక్షించవచ్చు. అలాగే మీరు రాణిఖేత్ చుట్టుపక్కల ప్రాంతాల చుట్టూ తిరగవచ్చు. ఇక్కడ ఝూలా దేవి ఆలయం, ఉపత్ గోల్ఫ్ కోర్స్, బిన్సార్ మహాదేవ్ ఆలయాలను కూడా సందర్శించవచ్చు.
ముక్తేశ్వర్..
ముక్తేశ్వర్, ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీ నుండి 72 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక చిన్న గ్రామం. ఇది సముద్ర మట్టానికి 7500 అడుగుల ఎత్తులో ఉంది. ప్రకృతి అందాలతో నిండిన ఈ ప్రాంతంలో ఇసుమంత కూడా కాలుష్యం ఉండదు. దీంతో రాత్రిపూట ఇక్కడ మెరిసే నక్షత్రాలు ఆకాశాన్ని కప్పేసి కనిపిస్తాయి. చాలా మంది పర్యాటకులు, ముఖ్యంగా ఫోటోగ్రాఫర్లు ఈ హిల్ స్టేషన్‌కి రాత్రిపూట నక్షత్రాలను చూసేందుకు వస్తుంటారు.
మున్సియరి, పితోరాఘర్...
మున్సియరి ఒక అందమైన హిల్ స్టేషన్. ఇది నేపాల్, టిబెట్ సరిహద్దుల సమీపంలో ఉంటుంది. ఈ ప్రదేశం అన్ని వైపులా పర్వతాలతో చుట్టుముట్టి ఉంటుంది. మున్సియరీకి ఎదురుగా ప్రపంచ ప్రసిద్ధి చెందిన పంచులి పర్వతం, అంటే హిమాలయాలలోని ఐదు శిఖరాలు, ఎడమ వైపున నందా దేవి, త్రిశూల్ పర్వతాలు, కుడి వైపున అద్భుతమైన పిక్నిక్ స్పాట్ అయిన దంధార్‌ను చూసే అవకాశం లభిస్తుంది. ఈ ప్రదేశంలో కూడా రాత్రిపూట మెరిసే నక్షత్రాలను చూసే అవకాశాన్ని పొందవచ్చు.
జార్జ్ ఎవరెస్ట్ శిఖరం...
జార్జ్ ఎవరెస్ట్ శిఖరం ముస్సోరీలోని గాంధీ చౌక్ నుండి దాదాపు 6 కి.మీ దూరంలో ఉంటుంది. ఇది ముస్సోరీలోని పర్యాటక ప్రదేశాలలో ఒకటి. ఈ నగరం రాత్రిపూట చాలా అందంగా కనిపిస్తుంది. ఇక్కడ అమావాస్య రోజుల్లో లేదా చంద్రుడు అస్తమించిన తర్వాత అందమైన పాలపుంతను చూడవచ్చు. అలాగే ఇక్కడ ప్రతి రాత్రి నక్షత్రాలతో నిండిన అందమైన ఆకాశాన్ని చూడవచ్చు.