- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Potato: ఈ సమస్యలు ఉన్నవారు బంగాళాదుంపను తినకపోవడమే మంచిది
దిశ, వెబ్ డెస్క్ : మనలో చాలా మంది బంగాళాదుంపను ఇష్టంగా తింటారు. కార్బోహైడ్రేట్లు, ఫైబర్, విటమిన్ సి, విటమిన్ B6, పొటాషియంతో విటమిన్లు, ఖనిజాలు కలిగి ఉంటాయి. అంతేకాకుండా దీనిలో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఎన్నో ఉంటాయి. అలాగే అన్ని రకాల కూరగాయలతో కలిపి బంగాళాదుంపను వండుకోవచ్చు.
వీటిని చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ఇష్టంగా తింటారు. మార్కెట్లో బంగాళా దుంపలు చాలా తక్కువ ధరకే దొరుకుతాయి. బంగాళాదుంపలో కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీరానికి అధిక శక్తినిస్తాయి.
బంగాళాదుంపలో ఉంటే యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని ఆరోగ్యంగా, మెరిసేలా చేస్తాయి. ఫైబర్ కూడా ఇందులో పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. బంగాళాదుంపలు తినడం వల్ల మలబద్ధకం నుంచి ఉపశమనం లభిస్తుంది. బంగాళాదుంపలను కొందరు మాత్రం మితంగా తీసుకోవాలి. దీనిలో ఉండే కార్బోహైడ్రేట్లు డయాబెటిస్ రోగులకు రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది. కాబట్టి , మధుమేహం ఉన్నవారు బంగాళాదుంపలను దూరం పెట్టిన పర్వాలేదు. కిడ్నీలో రాళ్లు ఉన్నవారు కూడా దుంపలు తక్కువగా తినాలని చెబుతున్నారు.