చిలకా.. పలుకవే..?

by samatah |   ( Updated:2022-03-07 05:09:13.0  )
చిలకా.. పలుకవే..?
X

దిశ, ఫీచర్స్ : మనుషులతో స్నేహం చేసే పక్షిజాతుల్లో 'చిలుక' కూడా ఒకటి. కుటుంబ సభ్యుల్లో ఒకరిగా కలిసిపోయి చిన్న చిన్న మాటలు వల్లె వేస్తూ అమితమైన ప్రేమ కురిపిస్తుంటాయి. ఇలాగే యజమానితో దీర్ఘకాల అనుబంధాన్ని పెంచుకున్న 'జెస్సీ' అనే ఆఫ్రికన్ గ్రే చిలుక.. ఇటీవల అతడు మరణించడంతో డిప్రెషన్‌కు గురై, మాట్లాడేందుకు నిరాకరించింది. తన ఈకలను తానే పీకేస్తూ వింతగా ప్రవర్తించింది. ప్రస్తుతం ఈ చిలుక సంరక్షణ బాధ్యతలను డోర్సెట్‌లోని యాష్లే హీత్ యానిమల్ సెంటర్‌ చేపట్టగా.. మొదట దాని వింత ప్రవర్తను చూసి చర్మవ్యాధిగా భావించారు. కానీ యజమాని మరణాన్ని తట్టుకోలేక బాధ, ఒత్తిడిని అనుభవిస్తోందని గ్రహించారు.


జెస్సీ దాదాపు తొమ్మిదేళ్ల పాటు ప్రస్తుతం చనిపోయిన దాని యజమాని దగ్గరే ఉంది. అందుకే అతని మరణాన్ని, వాతావరణంలో ఆకస్మిక మార్పును భరించలేకపోయింది. ఈ ప్రవర్తన యానిమల్ సెంటర్ సిబ్బందిని ఆందోళనకు గురిచేసింది. ఈ క్రమంలోనే జెస్సీకి కావలసిన ప్రేమను, కుటుంబాన్ని పునర్నిర్మించేందుకు రాచెల్ లెదర్ అడుగుపెట్టింది. ఫిబ్రవరిలో జెస్సీని తీసుకున్న ఈ డాగ్ బిహేవియరిస్ట్.. చిలుకలో విశ్వాసాన్ని పెంపొందించి మళ్లీ మాట్లాడేలా చేయగలిగింది. యజమాని మరణం తర్వాత పూర్తిగా కృంగిపోయి 'గుడ్‌బై' అనే ఒకే పదం పలికిన జెస్సీ.. తన కొత్త ఫ్యామిలితో మరికొన్ని పదాలు మాట్లాడుతోంది. ఇక లెదర్‌ను తన భర్త 'బేబ్' అని పిలవడం చూసిన జెస్సీ కూడా ఆమెను అలాగే పిలుస్తూ f**off అని చెబుతోంది. ఇందుకు లెదర్ కూడా ఫన్నీగా 'yes, f**ing' అని స్పందిస్తోంది.

Advertisement

Next Story

Most Viewed