- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Pain relief Tips : స్నానానికి ముందు ఈ సింపుల్ టెక్నిక్.. శరీరంలో ఆ నొప్పి నుంచి బిగ్ రిలీఫ్!
దిశ, ఫీచర్స్ : గంటల తరబడి ఓకే దగ్గర కూర్చోవడం, ఎక్కువసేపు నిలబడాల్సిన వర్క్ స్టైల్, గాడ్జట్స్ ఎక్కువగా వాడటం.. ఇలా పలు రకాల కారణాలతో కూడా చాలామంది ఇప్పుడు నడుము నొప్పి సమస్యను ఎదుర్కొంటున్నారు. తక్షణ ఉపశమనం కోసం కొందరు పెయిన్ కిల్లర్స్ కూడా వాడుతుంటారు. కానీ దీనివల్ల పలు రకాల సైడ్ ఎఫెక్ట్ వచ్చే అవకాశం ఉంటుందని ఆయుర్వేదిక్ నిపుణులు చెప్తున్నారు. అలాంటి రిస్క్ లేకుండా స్నానం చేసే ముందు పాటించే సింపుల్ టెక్నిక్ ద్వారా బయట పడవచ్చు అంటున్నారు. అదేంటో చూద్దాం.
* మీరు తరచుగా బ్యాక్ పెయిన్‌తో ఇబ్బంది పడుతుంటే దాని నుంచి రిలీఫ్ పొందే మార్గం ఉంది. ఏంటంటే.. ముందుగా ఒక బౌల్ తీసుకోండి, అందులో రెండు టేబుల్ స్పూన్లకు సరిపడా ఆవ నూనె, రెండు టేబుల్ స్పూన్ల నువ్వుల నూనె మిక్స్ చేసి వేడి చేయండి. ఆ తర్వాత దానిని రాత్రి పడుకునేముందు నడుముపై అప్లై చేసి మసాజ్ చేస్తే బ్యాక్ పెయిన్ తగ్గిపోతుందని నిపుణులు చెప్తున్నారు. ఇక ఆయిల్ రాసుకున్న గంట తర్వాత వేడి నీటితో స్నానం చేయడం మంచిది. దీనివల్ల మరింత రిలాక్స్ అవుతారు.
* బ్యాక్ పెయిన్‌తో కొందరు ఎముకల బలహీన సమస్యను ఎదుర్కొంటుంటారు. ఈ ప్రాబ్లం నుంచి బయటపడాలంటే మీ శరీరానికి తగిన కాల్షియం, విటమిన్ డి అవసరం. నువ్వులు, పాలు, పాలతో తయారయ్యే ఆహార పదార్థాలు, గుడ్లు, చేపలు, బాదం, ఆకు కూరలు వంటివి ఆహారంలో భాగంగా రెగ్యులర్‌గా తీసుకుంటూ ఉంటే నముడు నొప్పి రాకుండా ఉంటుందని, ఎముకలకు బలం చేకూరుతుందని పోషకాహార నిపుణులు అంటున్నారు.
* పడుకునే భంగి సరిగ్గా లేకపోవడం, హై హీల్స్ వేసుకోవడం, కుర్చీపై సరిగ్గా కూర్చోకపోవడం వంటి కారణాలతో కూడా నడుము నొప్పి వస్తుంది. అలాంటప్పుడు వాటిని మార్చుకోవడం లేదా హైహీల్స్ వేసుకునే అలవాటు మానుకోవడం ద్వారా సమస్యకు చెక్ పెట్టవచ్చు. దీంతోపాటు రెగ్యులర్ వ్యాయామాలు కూడా ముఖం.
*నోట్: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించడం లేదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.