- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బొద్దింకకు ఎర.. కొత్త శృంగార మార్గం..
దిశ, ఫీచర్స్: సాధారణంగా బొద్దింకలను చంపేందుకు ఉపయోగించే విషపూరిత ఎరలో గ్లూకోజ్ ఉంటుంది. విషం యొక్క చేదును కప్పి ఉంచేందుకు పురుగు మందుల తయారీదారులు గ్లూకోజ్ సమృద్ధిగా ఉండే మొక్కజొన్న సిరప్‌ను ఇందులో కలుపుతారు. దీన్ని ఏళ్లుగా తింటున్న బొద్దింకలు అసహ్యించుకోవడం మొదలుపెట్టాయని, వికారంగా భావిస్తున్నాయని కనుగొన్నారు శాస్త్రవేత్తలు. అయితే ఆడ బొద్దింకలు శృంగారంలో పాల్గొనే ముందు మగ బొద్దింకల వెనుక భాగంలో స్రవించే చక్కెర ద్రవాన్ని తీసుకుంటాయి. ఈ క్రమంలో మేల్ కాక్రోచ్ తన జననేంద్రియ హుక్‌ని ఫిమేల్ కాక్రోచ్‌లోకి జార్చి, 90 నిమిషాల పాటు లాక్ చేస్తుంది. అలాంటప్పుడు గ్లూకోజ్ పట్ల విముఖత ఉన్న ఆడ బొద్దింకలను ప్రలోభపెట్టేందుకు మగ బొద్దింకలకు కష్టమే కాదా? మరి ఇప్పుడు ఏం చేస్తున్నాయి? అని పరిశీలించారు శాస్త్రవేత్తలు.
ప్రయోగశాలలో 251 జతల జర్మన్ బొద్దింకలను (బ్లాట్టెల్లా జెర్మేనికా) వీడియో-రికార్డ్ చేశారు. ఫ్లోరిడాలోని బొద్దింకల్లో కొన్ని గ్లూకోజ్ పట్ల విరక్తిని కలిగి ఉంటే.. మరికొన్ని సాధారణంగానే ఉన్నాయి. ఈ క్రమంలో మగ బొద్దింకలు కొత్త ఫార్ములాను స్రవించడం, ఆడవారిని వేగంగా కట్టిపడేయడం ప్రారంభించారని తెలిపారు శాస్త్రవేత్తలు. స్రావాల విశ్లేషణలో గ్లూకోజ్-అవర్సివ్ గ్రూప్‌లోని వారి కంటే నాన్-గ్లూకోజ్-అవర్సివ్ గ్రూప్ నుంచి ఐదు రెట్లు ఎక్కువ గ్లూకోజ్ ఉన్నట్లు వెల్లడైంది. వాటిలో ఎక్కువ మాల్టోస్ కూడా ఉంది. ఇది లాలాజలానికి గురైనప్పుడు సెకన్లలో గ్లూకోజ్‌గా విచ్ఛిన్నమయ్యే చక్కెర. దీనికి విరుద్ధంగా గ్లూకోజ్-వ్యతిరేక సమూహాల నుంచి పురుషులు ఎక్కువగా మాల్టోట్రియోస్‌తో తయారు చేయబడిన స్రావాలను కలిగి ఉంటారు. ఇది లాలాజలంలో ఐదు నిమిషాల తర్వాత గ్లూకోజ్‌గా విచ్ఛిన్నమయ్యే సంక్లిష్ట చక్కెర. అంటే ఆడ బొద్దింకలు తమకు నచ్చని గ్లూకోజ్‌ని రుచి చూసే సమయానికి చాలా ఆలస్యం అవుతుందని, తర్వాత నచ్చని రుచి పొందినా పట్టించుకోవని తెలిపారు. ఎందుకంటే అప్పటికే కాపులేషన్‌లో నిమగ్నమైపోతాయి కాబట్టి.. 90 నిమిషాల పాటు తప్పకుండా కొనసాగించాల్సిన అవసరముంది.
ఇవి కూడా చదవండి: రోజుకు వందసార్లు శృంగారం..