mango tree: ఇదేదో బాగుందే.. ! ఒక్క మామిడి చెట్టుకు 5 ఏసీలు..!

by Disha Web Desk 3 |
mango tree: ఇదేదో బాగుందే.. ! ఒక్క మామిడి చెట్టుకు 5 ఏసీలు..!
X

దిశ వెబ్ డెస్క్: ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. వేసవికాలం కావడంతో భానుడు భగ్గుమంటున్నాడు. దీంతో వేడిని తట్టుకునేందుకు చాలామంది ఏసీ గదుల్లో కాలం గడుపుతున్నారు. అయితే ఏసీలో ఎక్కువసేపు ఉండడం ఆరోగ్యానికి మంచిది కాదు. ఎక్కువసేపు ఏసీలో ఉంటే కాళ్ళు నొప్పులు, కండరాలు పట్టేయడం వంటి సమస్యలు వస్తాయి.

అలానే శ్వాసకోశ వ్యాధులతో బాధపడే వాళ్ళు ఏసీల్లో ఉండడం చాలా ప్రమాదకరం. అందుకే ఏసీల కంటే ఎక్కవ చల్లధనాన్ని అందిచే మామిడి చెట్టును ఈ ప్రకృతి మనకి అందించింది. ఐదు ఏసీలు 1000 గంటల సమయం పాటు అందించే చల్లధనాన్ని ఒక్క మామిడి చెట్టు అందించగలదని పలు అధ్యయనాల్లో వెళ్లడైందని నిపుణులు తెలుపుతున్నారు.

50 సంవత్సరాలు వయసు కలిగిన మామిడి చెట్టు తన జీవితకాలంలో 81 టన్నుల కార్బన్ డయాక్సైడ్ పీల్చుకుంటుందని.. అలానే 271 టన్నుల ఆక్సిజన్‌ను విడుదల చేస్తుందని నిపుణులు పేర్కొన్నారు. కనుక క్లోరో ఫ్లోరో కార్బన్లను విడుదల చేసి పర్యావరణాన్ని నాశనం చేసే ఏసీల వాడకాన్ని తగ్గించమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలానే ఒక మామిడి చెట్టును పెంచి ఆరోగ్యకరమైన చల్లధనాన్ని ఆస్వాదించమని పర్యావరణ నిపుణులు సూచిస్తున్నారు.

Next Story

Most Viewed