వృద్ధులతో, ఆంటీలతో రాత్రి పగలు తేడా లేకుండా ఫుల్ ఎంజాయ్ చేస్తున్న కుర్రాళ్లు.. అక్కడదే ట్రెండ్?

by Kavitha |   ( Updated:2024-01-19 11:03:46.0  )
వృద్ధులతో, ఆంటీలతో రాత్రి పగలు తేడా లేకుండా ఫుల్ ఎంజాయ్ చేస్తున్న కుర్రాళ్లు.. అక్కడదే ట్రెండ్?
X

దిశ, ఫీచర్స్ : ఆఫ్రికా లోని అతి చిన్న దేశాల్లో గాంబియా ఒకటి. అక్కడ ఆకలి, నిరుద్యోగం, నిధులలేమితో పాటు కొంతకాలంగా మరో సమస్య కూడా మొదలైంది. గాంబియా ప్రధాన ఆదాయ వనరు పర్యాటక రంగం. బీచ్‌లలో సేదతీరేందుకు యూరోప్‌ దేశాల నుంచి పర్యాటకులు వస్తుంటారు. గాంబియా పేద దేశం కావడంతో ఉపాధి అవకాశాలు తక్కువ. దీంతో పలువురు పర్యాటక రంగంలో గైడ్లుగా ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. అయితే బీచ్‌లలో సేదతీరేందుకు యూరోప్‌ దేశాల నుంచి పర్యాటకులు వచ్చేవారిలో ఒంటరి మహిళలు.. ముఖ్యంగా విడాకులు తీసుకుని జీవితం గడుపుతున్న వారే ఎక్కువగా ఉంటారు.

ఇందులో మధ్య వయసు మహిళలు గాంబియా లోని స్థానిక యువకులు తో పరిచయం పెంచుకుని.. సహజీవనం చేస్తున్నారు. అలా సంపన్న దేశాల నుంచి వచ్చే మధ్యవయసు మహిళలతో వీరి స్నేహం ప్రేమగా మారుతుంది. అనంతరం వారితో పాటు ఆయా దేశాలకు వెళ్తున్నారు గాంబియా కు చెందిన యువకులు . యూరోప్‌లో స్థిరపడాలన్నది సగటు ఆఫ్రికా యువత కల. అలా పాశ్చాత్య మహిళలతో స్నేహంగా ఉంటూ ఆయా దేశాల్లోకి వెళ్లి ఉపాధి పొందుతున్నారు. అలా ఇటీవల 32 ఏళ్ల యువకుడు 65 ఏళ్ల మహిళను వివాహమాడటం గమనార్హం.

Advertisement

Next Story

Most Viewed