Rice: పాత బియ్యం- కొత్త బియ్యం.. ఆరోగ్యానికి ఏవి మంచివి? ఎన్నాళ్లు గడిస్తే పాత బియ్యమంటారు?

by Anjali |
Rice: పాత బియ్యం- కొత్త బియ్యం.. ఆరోగ్యానికి ఏవి మంచివి? ఎన్నాళ్లు గడిస్తే పాత బియ్యమంటారు?
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచ జనాభాలో దాదాపు సగం మంది అన్నం తినడానికే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. బియ్యంతో ఓన్లీ అన్నం మాత్రమే కాకుండా పలు రకాల వంటకాలు కూడా తయారు చేసుకుని తింటారు. ఈ పిండి వంటకాలు రుచిగా ఉండటంతో పాటు ఆరోగ్యానికి కూడా ఎంతో మంచివి. అలసట, ఆకలి బాగా వేసినప్పుడు కొంచెం రైస్ తింటే తక్షణమే ఎనర్జీ వస్తుంది. రైస్‌లో ఉండే కార్బోహైడ్రేట్లు శక్తి స్థాయిలను పెంచడంలో సహాయపడతాయి. అలాగే మెదడు చురుగ్గా పనిచేయడంలో తోడ్పడుతాయి.

జీర్ణ వ్యవస్థను ఉత్తేజితం చేస్తాయి. మలబద్ధకాన్ని నివారిస్తాయి. ఊబకాయానికి చెక్ పెడతాయి. రైస్‌లో ఉండే ఫైబర్ ఒబెసిటీని నియంత్రణలో ఉంచుతుంది. బియ్యంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు కొలెస్ట్రాన్‌ను తగ్గించి.. గుండె ఆరోగ్యాన్ని కాపాడుతాయి. రక్తపోటు, మధుమేహాంతో బాధపడుతున్నవారు అన్నం తింటే రక్తపోటు, మధుమేహానికి చెక్ పెట్టొచ్చు. మార్కెట్‌లో రెడ్, బ్లాక్, వైట్, వైల్డ్ రైస్ వంటి అనేక రకాల రైస్ అందుబాటులో ఉంటాయి. ఎక్కువ మంది తెల్లబియ్యానికే ఎక్కువగా ప్రిపరెన్స్ ఇస్తారు.

బియ్యంలో కార్బోహైడ్రేట్లు, ఐరన్, ఫాస్ఫరస్, ప్రొటీన్, మెగ్నీషియం, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. పాలిష్ చేయని బియ్యంలో మాత్రమే థయామిన్, ఫైబర్ ఉంటాయని పోషకాహార నిపుణులు చెప్పారు. గోధుమల్లో కార్బోహైడ్రేట్లు, ఫాస్ఫరస్, ప్రొటీన్, పొటాషియంతో పాటు బియ్యం కంటే రెండు రెట్లు ఎక్కువగా ఐరన్, కాల్షియం, ఫైబర్ ఉంటాయి. ఇక ఉడకబెట్టిన బియ్యాన్ని ఫ్లేక్డ్ రైస్ అని అంటారు. ఈ రకమైన రైస్ ను వివిధ పలు రకాల ఆహార పదార్థాల తయారీలో వాడుతారు. బియ్యం పశువులను మేపడానికి కూడా యూజ్ చేస్తారు. అయితే చాలా మంది కొత్త బియ్యం, పాత బియ్యం అని మార్కెట్‌లో వినే ఉంటారు. వేటిని తింటే ఆరోగ్యానికి మంచిదో తాజాగా నిపుణులు వివరించారు. ఈ విషయాలు ఇప్పుడు చూద్దాం..

పాత బియ్యం..

కొత్త బియ్యం, పాత బియ్యం రెండు పొలాల్లో పండినవే. కానీ రైస్‌ను మిల్లు నుంచి తీసుకొచ్చాక.. సంవత్సరం పాటు స్టోర్ చేస్తారు. అవే పాత రైస్‌గా పిలుస్తారు. పంట చేతికొచ్చాక ఏడాదిలోపు వాడే బియ్యాన్ని కొత్త బియ్యం అంటారు. రెండింటిలో పోషకాలు సేమ్ ఉంటాయి. కానీ కొత్త బియ్యం కంటే పాత బియ్యమే హెల్త్‌కు మంచివని చెబుతున్నారు నిపుణులు. పాత రైస్‌లో తేమ శాతం ఎక్కువగా ఉంటుంది. పూర్తిగా గ్లూటెన్ రహితంగా ఉంటాయి. అలాగే వండినప్పుడు అన్నం పుల్లలు పుల్లలుగా చక్కగా అవుతుంది. పాత బియ్యంలో విటమిన్లు, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. అలాగే పాత రైస్‌తో చేసిన వంటకాలు చాలా టేస్టీగా ఉంటాయి.

కొత్తబియ్యం..

కొత్త బియ్యం చాలా తెల్లగా ఉంటాయి. సున్నితంగా ఉంటాయి. ఈ బియ్యాన్ని మిల్లులో పాలిష్ చేసి తీసుకువస్తారు. కాగా వెంటనే కొత్త బియ్యాన్ని తీసుకోవడం ఆరోగ్యానికి అంత మంచిది కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు. పైగా ఇందులో తేమ తక్కువగా ఉంటుంది. వండేటప్పుడు కొత్త బియ్యం ఎక్కువ వాటర్ తీసుకుంటుంది. మళ్లీ అన్నం కూడా సరిగ్గా అవ్వదు. కార్బోహైడ్రేట్లు, పోషకాలు, ప్రోటీన్స్, లిపిడ్లు వంటివి మాత్రం రెండింటిలో సమానంగా ఉంటాయి. బిర్యానీ, పులావ్ చేసుకోవాలనుకున్నప్పుడు పాత బియ్యమే చూస్ చేసుకుంటే బెటర్. కొత్త బియ్యంతో అయితే ఈ వంటకాలు సరిగా రావు. పొడి పొడిగా కాకుండా జిగటగా వస్తుంది. కాగా వీలైనంతవరకు రుచికరమైన వంటకాలను పాత రైస్‌తోనే వండటానికి ట్రై చేయండి.

గమనిక: పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. కేవలం మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించగలరు.

Advertisement

Next Story

Most Viewed