- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
1963లో ప్రేమ 2023లో పెళ్లి.. ఈ వృద్ధ జంట ప్రేమ గురించి ఎంత చెప్పినా తక్కువే?
దిశ, వెబ్‌డెస్క్ : ప్రేమ అనేది రెండు మనుసుల కలయిక. ఒక్కసారి ఒకరి మీద ప్రేమ మొదలైందంటే అది ఎప్పటికీ పోదు అంటారు. ఇక నిజమైన ప్రేమ అనేది ఎప్పటికైనా గెలుస్తుంది అంటారు. ఈ జంటను చూస్తే అదే నిజమేమో అనిపిస్తుంది. ఎన్నో ప్రేమ జంటలకు ఈ జంట ఇన్ స్పిరేషన్‌గా నిలుస్తుంది. ఎందుకంటే 1963లో మొదలైన ఈ ప్రేమ ఎన్నో సంవత్సరాల తర్వాత 2023 ఒకటయ్యింది. ఇక ఈ జంట స్టోరీ, వీరు కలవడానికి ఇన్ని సంవత్సరాలు ఎందుకు పట్టిందో ఇప్పుడు తెలుసుకుందాం.
లెన్ ఆల్‌బ్రైటన్, జీనెట్ స్టీర్ మొదటిసారిగా 1963లో ఐల్ ఆఫ్ వైట్‌లో ట్రైనీ నర్సులుగా ఉన్నప్పుడు కలుసుకున్నారు.వారు ప్రేమలో పడ్డారు.వివాహం చేసుకుని ఆస్ట్రేలియాకు వెళ్లాలని అనుకున్నారు, కానీ జీనెట్ తల్లిదండ్రులు లెన్‌తో పెళ్లిని నిరాకరించారు.ఎందుకంటే ఆ సమయంలో వారు చట్టబద్ధంగా వివాహం చేసుకోవడానికి చాలా చిన్న వయస్సులో ఉన్నారు.లెన్ ఆస్ట్రే ఆస్ట్రేలియాకు వెళ్లి, భూమిని కొనుగోలు చేసి, అక్కడ జీనెట్ తో కలిసి జీవించాలని ఆశించాడు. కానీ ఆయన ఆశలు అడియాశలు అయ్యాయి. వారు కలగన్నట్లు వారు పెళ్లి చేసుకోలేదు. ఎంతో సంతోషంగా ఉందామనుకున్న ఆ జంట విడిపోయింది. తర్వాత వారు ఒకరినొకరు ఎప్పుడూ కలవలేదు.
.
2015లో లెన్ వివాహం ముగిసింది.ఆపై అతను జీనెట్ తనను గుర్తుంచుకుందో లేదో తెలుసుకోవడానికి ఆమె చిరునామాను వెతకాలని నిర్ణయించుకున్నాడు. తర్వాత కష్టపడి ఆమె అడ్రెస్ సంపాదించాడు. ఆమెకు వివాహం జరిగిందని, పెళ్లైన రెండు సంవత్సరాలకే భర్త క్యాన్సర్‌తో మరణించినట్లు తెలుసుకున్నాడు. ఇక లెన్ పంపిన క్రిస్మస్ కార్డు ద్వారా జీనెట్ తన లవర్ లెన్‌ను కలుసుకుంది. తర్వాత వారు కలుసుకొని చివరకు 2023లో పెళ్లి చేసుకున్నారు. లెన్, జీనెట్‌ల ప్రేమ 60 సంవత్సరాలకు పైగా విడిపోయినప్పటికీ వారి ప్రేమ మాత్రం బలంగానే ఉంది.ఈ లవ్ స్టోరీ తెలుసుకున్న ప్రతీ ఒక్కరూ ఎమోషనల్ కామెంట్స్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి: ఒంటరి తనంతో అనేక ఆరోగ్య సమస్యలు.. నిపుణులు ఏం చెబుతున్నారంటే?