ఎంతకీ పెళ్లి కావడం లేదా.. ఇవి ధరిస్తే సంబంధం ఖాయమే

by Shiva |   ( Updated:2023-07-01 12:22:11.0  )
ఎంతకీ పెళ్లి కావడం లేదా.. ఇవి ధరిస్తే సంబంధం ఖాయమే
X

దిశ, వెబ్ డెస్క్ : 'ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు' అని వెనుకటికి అన్నారు మన పూర్వికులు. ఇళ్లేముందండి.. డబ్బుంటే కట్టడం సులువే అంటారు. కానీ, పెళ్లి అలా కాదు. కొందరికి ఎన్ని సంబంధాలు చూసిన ఖాయం కావు. మరికొందరికి ఖాయమైన సవాలక్ష ఆంక్షలు, జాతకాలతో కారణంగా వీగిపోతుంటాయి. కొందరికి ఏళ్ల తరబడి సంబంధాలు చూసిన జీవిత భాగస్వామి దొరకడం కష్టమే. కొందరికి పెళ్లేనా దంపతుల మధ్య సాన్నిహిత్యం, అపార్థాలు చేసుకోవడం, తరచూ గొడవలు, కలహాలతో మానసిక ప్రశాంతత లేకుండా పోతుంది. దీని వల్ల శారీరకంగా, మానసికంగా ఆనందంగా వారు ఉండలేరు.

అయితే, వీటన్నింటికి పరిష్కారం జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని పరిహారాలు చేయడం వల్ల వివాహ సంబంధిత సమస్యలు తొలగిపోయి మానసిక ప్రశాంతత చేకూరుతుంది. ఎంతకీ పెళ్లి కాని వారు, పెళ్లయ్యాక రకరకాల సమస్యలు ఎదుర్కొంటున్న వారు రుద్రాక్ష ధరిస్తే ప్రయోజనం ఉంటుందని చెబుతున్నాయి శాస్త్రాలు. పరమ శివుడి ప్రతిరూపమే రుద్రాక్ష. రెండు ముఖాల రుద్రాక్షను ద్విముఖ రుద్రాక్షగా వ్యవహరిస్తారు. ఇది పెళ్లి కాని వారికి వరం లాంటిది. ఈ రుద్రాక్షను ధరించడం వల్ల వివాహానికి ఉన్న సకల ఆటంకాలు తొలగిపోతాయి. త్వరగా పెళ్లి అయ్యేందుకు అన్ని పరిస్థితులు అనుకూలిస్తాయి. పెళ్లైన వారు ధరిస్తే దాంపత్య బంధంలో శారీరక, మానసిక ప్రశాంతత లభిస్తుంది.

Read More: నిజాన్ని పట్టించుకుంటే నువ్వు ఎప్పటికీ ఎదగలేవు: మోటివేషనల్ స్పీకర్ కృష్ణ చైతన్య రెడ్డి (వీడియో)

Advertisement

Next Story