- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
అక్రమ సంబంధం ఉన్నట్లు తేలితే.. జాబ్ ఊడిపోయినట్లే.. కొత్త నిబంధన
దిశ, ఫీచర్స్ : చైనాలో ఓ కంపెనీ పెట్టిన నిబంధన సోషల్ మీడియాలో వైరల్ అయింది. జెజియాంగ్‌కు చెందిన కంపెనీ ‘ఎక్స్‌ట్రామ్యారిటల్ ఎఫైర్ ప్రొహిబిషన్’ రూల్‌ను అమల్లోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. ఇది వివాహిత ఉద్యోగులందరికీ వర్తిస్తుందని.. ఒకవేళ ఇలాంటి ఎఫైర్స్ ఉంటే జాబ్ నుంచి తొలగిస్తామని హెచ్చరించింది. కంపెనీ అంతర్గత నిర్వహణను బలోపేతం చేయడానికి.. కుటుంబం, భాగస్వామితో ప్రేమతో ఉండేందుకు.. మెరుగ్గా రక్షించుకునేందుకు.. పనిపై దృష్టి పెట్టాలని సూచించింది.
‘No illicit relationship, no mistress, no extramarital affair, no divorce’ అంటూ 4N పాలసీని తీసుకొచ్చింది కంపెనీ. అయితే ఈ చర్యను చాలా మంది నెటిజన్స్ స్వాగతించగా.. పర్సనల్ ఫ్రీడమ్, ప్రైవసీ లేకుండా చేయడం కిందకే వస్తుందని మరికొందరు కంపెనీని విమర్శించారు. వివాహేతర సంబంధాలకు వ్యతిరేకంగా చర్య తీసుకోవడం మంచిదే కానీ.. ఆ మ్యాటర్‌తో ఉద్యోగం నుంచి రిమూవ్ చేయడం సమంజసం కాదంటున్నారు. ఉద్యోగులను వారి అర్హతలు, నైపుణ్యాలు, ప్రతిభ ఆధారంగా అంచనా వేయాలి కానీ ఈ విధంగా కాదని.. ఇది ఎంప్లాయి హక్కులను ఉల్లంఘించడం కిందకు వస్తుందంటున్నారు. వ్యక్తిగత జీవితాలను వృతితో ముడిపెట్టకూడదని.. ఒకవేళ వ్యక్తి చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడితే చట్టం చూసుకుంటుంది కదా అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి: