- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విద్యుత్ అవసరం లేని వాషింగ్ మెషిన్
దిశ, ఫీచర్స్ : పారిశుధ్యం, తాగునీరు, విద్యుత్, విద్య.. ఇలా గ్రామీణ జీవితాన్ని అనేక సమస్యలు పట్టి పీడిస్తున్నాయి. బట్టలు ఉతికేందుకు ఎక్కువ సమయం కేటాయించాల్సి రావడంతో మహిళలు సంపాదించే అవకాశాలు కోల్పోతున్నారు. యూకేలో హై-ఎండ్ వాక్యూమ్ తయారీ కంపెనీ ఉద్యోగి నవజోత్ సాహ్ని ఈ పరిస్థితులను దగ్గరి నుంచి గమనించాడు. ఈ బ్రిటిష్ ఇండియన్ విశ్రాంతి కోసం ఇండియాకు వచ్చినప్పుడు... తమిళనాడుకు చెందిన గృహిణి దివ్య బట్టలు ఉతకడం వల్ల వెన్ను నొప్పి, చర్మ సమస్యలతో బాధ పడుతున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే తన ఇంజనీరింగ్ నైపుణ్యాలకు పదునుపెట్టిన సాహ్ని.. తక్కువ ఖర్చుతో 'మాన్యువల్ వాషింగ్ మెషిన్' తయారు చేశాడు. దీనికి కరెంటు అవసరం లేకపోగా.. తక్కువ నీటితో బట్టలను ఉతకడం తో పాటు 70-80% ఆరిపోయేలా చేస్తుంది.
రూ. 5000-6000 ధరతో నవజోత్ రూపొందించిన ఈ ఆవిష్కరణ ప్రపంచవ్యాప్తంగా కార్పొరేట్స్, లాభాపేక్షలేని సంస్థల నుంచి అనేక గ్రాంట్లు, అవార్డులతో పాటు మద్దతు పొందింది. ఆగస్టు 2018 లో మొదటి యంత్రాన్ని ప్రారంభించిన సాహ్ని.. 'ది వాషింగ్ మెషిన్ ప్రాజెక్ట్' ద్వారా ఇప్పటివరకు ఇరాక్, లెబనాన్ అంతటా 150కు పైగా మెషిన్స్ అందజేశాడు. ఈ మేరకు దాదాపు 1,350 మందిని సానుకూలంగా ప్రభావితం చేశాడు. ఈ ప్రాజెక్టు కింద కొన్ని సంస్థలు అతని నుంచి యంత్రాలను కొనుగోలు చేసి ఉచితంగా పంపిణీ చేస్తాయి. కాగా పల్లెటూరి జీవనశైలిలో తలెత్తే సమస్యలను స్వయంగా తెలుసుకున్న తర్వాత, తన నైపుణ్యాలతో వారికి ప్రయోజనం చేకూర్చే ఉత్పత్తిని తయారు చేయాలనుకున్నాడు. ఈ మేరకు ఉద్యోగానికి రాజీనామా చేసిన సాహ్ని.. ఏడాది పాటు కష్టపడి వాషింగ్ మెషిన్ రూపొందించాడు.
'సలాడ్ స్పిన్నర్' వంటి డిజైన్ 'దివ్య 1.5'
12 అభివృద్ధి చెందుతున్న దేశాల్లో 2,500 కుటుంబాలపై చేసిన సర్వే ద్వారా బట్టలు ఉతికే పని మహిళలు, పిల్లల శ్రేయస్సును, జీవనోపాధిని ప్రభావితం చేస్తోందని అర్థమైంది.
దీంతో సలాడ్ స్పిన్నర్ సూత్రాల ఆధారంగా యంత్రాన్ని రూపొందించాను. ఇది ఒక వాష్‌కు 5 Kg కెపాసిటీ, 500 RPM వరకు వేగాన్ని కలిగి ఉంటుంది. రెండేళ్ల వారంటీ గల ఈ మిషన్ 35 కిలోల బరువు ఉంటుంది. డీవాటరింగ్ ఫెసిలిటీ కల్పించే స్పీడ్-సోక్ డ్రమ్.. బట్టలను ఆరబెట్టే సమయాన్ని తగ్గిస్తుంది. చేయాల్సిందల్లా బట్టలను మెషిన్ లోపల పెట్టి హ్యాండిల్‌తో మాన్యువల్‌గా చక్రం తిప్పడమే. ప్రస్తుతం 15 దేశాల నుంచి 2,000కు పైగా ప్రీ-ఆర్డర్స్ పొందాము.
- నవజోత్ సాహ్ని