- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Constipation: ఎన్ని మందులువాడినా మలబద్ధకం తగ్గటల్లేదా.. అయితే, వీటిని ట్రై చేయండి
దిశ, ఫీచర్స్: ఒకప్పుడు ఏది తిన్నా కూడా వెంటనే జీర్ణమయ్యేది కానీ, ఇప్పుడు తిన్నా కూడా అనేక అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. వాటిలో మలబద్ధకం సమస్య పట్టి పీడిస్తుంది. మనం తినే ఆహారంలో మార్పుల కారణంగా ఇది ఎక్కువవుతుంది. కొందరు దీన్ని తగ్గించడం కోసం హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతుంటారు అయినా కూడా ప్రయోజనం కూడా ఉండదు. కొన్ని అలవాటు చేసుకుంటే దీని నుంచి సులభంగా బయటపడొచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకుంటే ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..
యాపిల్ తినడం వలన జీర్ణ క్రియ పనితీరును మెరుగుపరస్తుంది. దీనిలో ఉండే పెక్టిన్ అనే కరిగే ఫైబర్ ఉంటుంది. ఇది మలాన్ని మృదువుగా చేస్తుంది. పేగు కదలికలను కూడా ఇది సహాయపడుతుంది. దీని వలన విరేచనం మంచిగా అవుతుంది.
కొందరు ద్రాక్ష ను దూరం పెడతారు. మలబద్ధకం సమస్య ఉన్న వారు ఖచ్చితంగా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే, దీనిలో ఉండే నీరు, ఫైబర్ కంటెంట్ జీర్ణ సంబంధిత సమస్యను పూర్తిగా దూరం చేస్తుంది. అరటి పండ్లు కూడా ఈ సమస్యను తగ్గించగలదు. దీనిలో ఉండే పొటాషియం కడుప నొప్పిని తగ్గిస్తుంది.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి తీసుకోబడింది. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే. ‘దిశ’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.