Nindu Noorella Saavasam: అరుంధతిని తలుచుకుని బాధపడుతున్న పిల్లలు.. టార్చర్ మొదలు పెట్టిన మనోహరి!

by Vinod kumar |   ( Updated:2023-08-30 14:16:08.0  )
Nindu Noorella Saavasam: అరుంధతిని తలుచుకుని బాధపడుతున్న పిల్లలు.. టార్చర్ మొదలు పెట్టిన మనోహరి!
X

దిశ, ఫీచర్స్: రోజురోజుకీ ఆసక్తికరమైన మలుపులతో కొనసాగుతున్న సీరియల్ నిండు నూరేళ్ల సావాసం. ఒక ఆర్మీ లెఫ్టినెంట్ కుటుంబ కథతో సాగుతున్న ఈ సీరియల్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. అరుంధతి చనిపోవడంతో కథలో ట్విస్ట్ ఇచ్చిన ఈ సీరియల్ ఈరోజు(ఆగస్టు 30) ఎపిసోడ్‌లో ఏం జరగనుందో తెలుసుకుందాం.. అరుంధతి చనిపోవడంతో ఒంటరితనంతో బాధపడుతుంటారు పిల్లలు. తల్లిలేని పిల్లల పరిస్థితి చూసి తల్లడిల్లిపోతుంది అమర్ తల్లి. పిల్లలపట్ల దురుసుగా ఉండటం వల్ల వాళ్లు ఏ విషయాన్ని పంచుకోలేకపోతున్నారని కొడుకుని మందలిస్తుంది అమర్ తల్లి. పిల్లలతో కాస్త ప్రేమగా ఉండి వాళ్లకు అన్ని విషయాలు పంచుకునే స్వేచ్ఛ ఉండేలా చూసుకోమని సూచిస్తుంది. బెడ్ రూమ్లో బాధపడతున్న పిల్లలను పలకరించి ఇకనుంచి వాళ్లకు తల్లైనా తండ్రైనా తానేనని చెప్పి వాళ్లను దగ్గరకు తీసుకుంటాడు. పిల్లలు కూడా తండ్రిని హత్తుకుని ఏడుస్తారు.

సవతి తల్లి వేధింపులు తట్టుకోలేక అరుంధతి తాళి తాకట్టు పెట్టడానికి నిశ్చయించుకుంటుంది భాగమతి. ఆ తాళి తీసుకుని గుడికి వెళ్లి తాను చేస్తున్న తప్పుకి క్షమించమని దేవున్ని కోరుకుంటుంది. గుడి నుంచి హాస్టల్కి వెళుతున్న భాగీకి అమర్ ఎదురుపడతాడు. కొడైకెనాల్ నుంచి తన వెనకాలే పడుతూ అన్నింటికీ అడ్డుపడుతున్నాడని మండిపడుతుంది భాగీ. అమర్పై కోప్పడుతూ వెళుతున్న భాగీ బ్యాగ్ నుండి ఒక చిన్న ప్యాకెట్ కింద పడటం గమనిస్తాడు అమర్. దానిలోనుండి ఆరు తాళి బయటపడుతుంది. ఏదో కిందపడిందని భాగీని పిలిచి చెప్పినా పట్టించుకోకుండా వెళ్లిపోతుంది.

ఉదయం నాలుగింటికే అలారం పెట్టి పిల్లలను లేపుతుంది మనోహరి. ఎనిమిదిన్నరకి స్కూల్ అయితే నాలుగింటికి లేవడం ఎందుకని ప్రశ్నిస్తారు పిల్లలు. టైమ్కి స్కూల్కి చేరాలంటే లేవకతప్పదని చెబుతుంది మనోహరి. ఆమె తీరు నచ్చట్లేదని పిల్లలు వాపోతారు. స్కూల్‌కి వెళుతూ వెనక్కి తిరిగి ఏమైనా మర్చిపోయారా అని తండ్రిని అడుగుతారు పిల్లలు. తల్లి అరుంధతి అలాగే అడిగేదని గుర్తుచేసుకుని ఏడుస్తారు. ఆరు ఆత్మ పక్కనే నిలబడి ఉన్నా, కానీ అమర్ ఆమెని చూడలేకపోతాడు.

ఇక ఇక్కడ ఉన్నది చాలు పైకి వెళ్లిపోదామని అరుంధతిని అడుగుతాడు చిత్రవిచిత్ర గుప్తుడు. కానీ తన దశదిన కర్మ జరిగేవరకు ఇక్కడే ఉంటానని వేడుకుంటుంది అరుంధతి. నిజం తెలుసుకుని తట్టుకునే ధైర్యం ఉంటేనే ఆ నిర్ణయం తీసుకోమని హెచ్చరిస్తాడు చిత్రగుప్తుడు. అరుంధతి చావుకిమనోహరే కారణమని అరు ఆత్మ తెలుసుకుంటుందా? బ్యాగ్లో తాళి లేదని గమనించిన భాగీ ఏం చేస్తుంది? తెలియాలంటే ఈరోజు, ఆగస్టు30న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్ తప్పకుండా చూడాల్సిందే!

Advertisement

Next Story