- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
యంగ్ ఏజ్‌లో సెక్స్ ఎక్స్‌పీరియన్స్ చేస్తే.. లైంగిక జీవితం ఎలా ఉంటుందంటే?
దిశ, ఫీచర్స్ : సెక్స్‌లో పాల్గొనేందుకు సరైన వయసు ఏదనేది ఇప్పటికీ చర్చించదగిన అంశమే. సొసైటీలో వివాహానికి ముందు సెక్స్‌పై నిషేధం కొనసాగుతున్నప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న సామాజిక వాస్తవికత ఎప్పటికప్పుడు ఈ విషయాన్ని సవాల్ చేస్తోంది. ఏదేమైనా పిల్లలు ఎర్లీ ఏజ్‌లో లైంగిక చర్యలో పాల్గొంటున్నారనే ఆలోచన తల్లితండ్రులకు ఆందోళన కలిగిస్తుంది. కానీ ఇదే విషయంపై టొరంటో మిస్సిసాగా యూనివర్సిటీ సైకాలజీ డాక్టర్ డయానా పెరాగిన్ అధ్యయనం ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ వెల్లడించింది.
ఈ అధ్యయనం ప్రకారం చిన్న వయసులో లైంగిక అనుభవాలు పొందిన వ్యక్తులు.. పెద్దయ్యాక మెరుగైన లైంగిక పనితీరును కలిగి ఉంటారు. ఆలస్యంగా ఎక్స్‌పీరియన్స్ చేసినవారు చివరకు లైంగిక ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంది. అయితే ఈ లైంగిక అనుభవాలు సంభోగం కంటే కూడా మొదటి లైంగిక సంబంధం, మొదటి లైంగిక ప్రేరణ, మొదటి భావప్రాప్తి వంటి చర్యలతో ముడిపడి ఉంటాయి. ఇక పరిశోధకులు సైతం అధ్యయనంలో పాల్గొన్న 3,139 మందిని ఇవే ప్రశ్నలడిగారు. గత నాలుగు వారాల్లో కోరిక, ఉద్రేకం, లైంగిక సంతృప్తితో ఏవైనా లైంగిక ఇబ్బందులు ఉన్నాయా? అని కూడా అడిగి తెలుసుకున్నారు. మొత్తానికి ఎర్లీ ఏజ్‌లో సెక్స్‌లో పాల్గొన్నవారు ఈ డొమైన్స్‌లో చాలా తక్కువగా లైంగిక ఇబ్బందులు ఎదుర్కొన్నారని, అందువల్లే ఆరోగ్యకరమైన లైంగిక పనితీరు కనబరిచారని పెరాగిన్ చెప్పారు.
అయితే ఇక్కడ వివాహానికి ముందు లేదా కౌమారదశకు ముందు వయసును 'ఎర్లీ'గా అనుకోవచ్చు. కానీ ఈ అధ్యయనంలో పాల్గొన్నవారిలో లైంగిక సంపర్కానికి సగటు వయసు మాత్రం 17 సంవత్సరాలే. అంటే ఈ అధ్యయన ఫలితాల ఆధారంగా.. పెళ్లి వరకు శృంగారం విషయంలో సంయమనం పాటిస్తే దీర్ఘకాలికంగా లైంగిక ఆరోగ్యానికి హాని చేకూరుతుందని డాక్టర్ పెరాగిన్ తెలిపారు.
సెక్స్ లైఫ్‌కి మరింత కిక్ ఇచ్చే "ఛీ, పాడు" మాటలు.. ఎలాగంటే..?!